తెల్లరేషన్ కార్డ్ లేని నిరుపేదలకు ప్రభుత్వం సహకారం అందించాలి : బస్వా లక్ష్మి నర్సయ్య

70 0

తెల్లరేషన్ కార్డ్ లేని నిరుపేదలకు ప్రభుత్వం సహకారం అందించాలి అని నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య, జిల్లా కలెక్టర్,
నిజామాబాద్ గార్కి మెయిల్ ద్వారా పంపడం జరిగింది.

 

ఒకసారి లేఖను పరిశీలిస్తే

గౌరవనీయులైన జిల్లా కలెక్టర్,
నిజామాబాద్ గార్కి మెయిల్ ద్వారా పంపడం జరిగింది.

బస్వా లక్ష్మి నర్సయ్య
జిల్లా అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ.

*విషయం :* వివిధ లాగిన్లలో ఉన్న పెండింగ్ రేషన్ కార్డులకు ప్రస్తుత కరోనా విపత్తు సమయంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి  వచ్చే సంక్షేమ ఫలాలు అందించుట గురించి

      ప్రస్తుతం  కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న సంగతి మనకు తెలిసినదే. ఇలాంటి విపత్కర పరిస్థితులలో మన భారతదేశంలో  కరోనా వైరస్ విస్తరించకుండా ఉండేందుకు  దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడి గారు ముందుచూపుతో లాక్ డౌన్ వంటి సాహసోపేత నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను తూచ తప్పకుండా పాటిస్తూ, కరోనా నివారణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ, జిల్లాలో  కరోనా వైరస్ మరింతగా  విస్తరించకుండా ప్రణాళికలు రూపొందిస్తున్న జిల్లా కలెక్టర్ గార్కి, కమీషనర్ ఆఫ్ పోలీస్ గార్కి, అడిషనల్ కలెక్టర్లకు, మున్సిపల్ కమీషనర్ గార్కి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గార్కి, సూపరెండెంట్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి గార్కి,ఆరోగ్య శాఖ,  రెవిన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్ సిబ్బందికి,  పారిశుద్ధ్య కార్మికులకు,  ఆశ వర్కర్లకు భారతీయ జనతాపార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
లాక్ డౌన్ వంటి  కఠిన పరిస్థితులలో ప్రతీఒక్కరు  ఆకలితో  అలమటించకూడదన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులు లబ్ది పొందుతున్నప్పటికీ, జిల్లాలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ  గిర్దావర్, తహసీల్దార్ మరియు జిల్లా పౌర సరఫరాల అధికారి గార్ల లాగిన్లలో 21, 613 మరియు రేషన్ కార్డులో మెంబర్ అడిషన్  దరఖాస్తులు 39, 771 పెండింగులో ఉన్నట్టు తెలిసినది. వీరి దరఖాస్తులన్నీ పెండింగులో ఉండడంతో ప్రస్తుత కరోనా పరిస్థితులలో  వీరంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఫలాలు పొందలేకపోతున్నారు. నిజంగా  వీరంతా కూడా  బీదవారైనందున వీరికి కూడా తమరియొక్క విచక్షణాధికారంతో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఫలాలు అందేవిధంగా చర్యలు తీసుకొని వారిని మానవతాదృక్పథంతో ఆదుకోవాలని,  అదేవిధంగా ఇదివరకే సిద్ధం చేసిన వలసకార్మికుల జాబితాలో అందరూ నమోదు కానందున, అధికారులు  స్థానిక ప్రజాప్రతినిధులతో  సమన్వయపర్చుకొని మరోసారి సర్వే చేసి  అర్హులైన  వలసకార్మికుల  జాబితా తయారు చేసి వారికి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించే ఫలాలు ఇవ్వాలని  భారతీయ జనతా పార్టీ తరపున తమరిని కోరనైనది.
భవదీయ
(బస్వా లక్ష్మీ నర్సయ్య)
జిల్లా భాజపా అధ్యక్షులు

Related Post

కరోనాతో మాజీ ఎమ్మెల్యే రాజయ్య మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు.కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్యకు అనుమానంతో కుటుంబ సభ్యులు నిన్న కరోనా పరీక్ష చేయించారు.కరోనా పాజిటివ్‌గా…

మెక్సికోలో తొలి తెలంగాణ సంఘానికి బీజం వేసిన రాజశేఖర్ ర్యాడకు జన్మదిన శుభాకాంక్షలు

చీమలు దూరని చిట్టడివిలోకి అడుగుపెట్టి జనజీవన స్రవంతి గా మార్చటం ఎంత కష్టమో మెక్సికో లాంటి దేశంలో తెలుగు వాళ్లకు ఒక సంఘం పెట్టడం అంత కష్టం.…

అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో మహిళా రైతులకు సన్మానం

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కొనసమందర్ గ్రామంలోని మహిళా ప్రాంగణంలో నలుగురు మహిళా రైతులు అలిసాల సత్తెమ్మ,బద్దం లక్ష్మీ,…

బోడుప్పల్ నగర వాసిపై టిఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ భర్త దౌర్జన్యాన్ని ఖండించిన మూడెత్తుల మల్లేష్ యాదవ్

బోడుప్పల్ ద్వారకా నగర్ కాలనీ నివాసి అయిన పురేందర్ రెడ్డిని 27వ డివిజన్ టిఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ భర్త అతి దారుణంగా కొట్టిన ఈ అమానుషమైన సంఘటనను…

సందిగ్ధంలో తెలంగాణ విఠల్ భవిష్యత్తు?

తెలంగాణ విఠల్.. ఈ పేరు చెబితే ఉద్యమ సమయంలో ప్రతి ఉద్యమకారుడు నోటా వచ్చే ఒకే మాట, అజాత శత్రువు.నోరు తెరిచి ఏదీ అడిగాడు,ఇచ్చిన పని కోసం…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *