పసుపుకి హబ్ గా మారనున్న ఇందూరు

0
548

తెలంగాణా కి పట్టు కొమ్మ ఏదైనా ఉంటంటే అది పసుపు కొమ్ము ,దేశంలోనే అత్యదికంగా నిజామాబాదు ,కరీంనగర్ జిల్లాల్లో ఆర్మూర్ ,బాల్కొండ ,మెట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువగా పండుతుంది . ఒక సమయం లో బంగారానికి సమానంగా పసుపు రేట్ వచ్చింది ,కాని తర్వాత ఆ రేట్ రాలేదు ,పసుపు వినియోగం దేశం లో చాలా ఉన్నా ,రైతు కి మాత్రం నష్టాలు మిగులుస్తుంది ,మరొక విచిత్రమైన విషయం ఏంటంటే పసుపుని దిగుమతి చేసుకుంటున్నారు . ఇంతలా పసుపు ఉత్పత్తి అవుతున్న దర ఎందుకు రావటం లేదంటే కచ్చితంగా ప్రబుత్వ విదానలే . పసుపు శుద్ధి కేంద్రం ఉంటె రైతులకి లాభం చేకూరగా ,ప్రబుత్వానికి లబ్ది పొందుతుంది.ఈ విషయం చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా కూడా అమలు కావటం లేదు , నిజామాబాదు MP కవిత కూడా పార్లమెంట్ లో చాల సార్లు ప్రస్తావించింది . నిజానికి 11వ ఆర్షిక సంఘం సిఫారసుల మేరకు ప్రతి రాష్ట్రంలో ఒక పసుపు కేంద్రం ఉండాలి ,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరైన పార్కును గుంటూరు జిల్లాలో నిర్మించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక స్పైస్ పార్కు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. . కాని కేంద్రం నుంచి సానుకూలమైన స్పందన రాకపోవటం తో స్పైస్ పార్కు (సుగంధ ద్రవ్యాల పార్కు)ను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేయూలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూరు మండలం పడిగల్ గ్రామంలో రానున్న రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలనీ సిఎం చెప్పారు.
ఇంతకూ ముందే బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి విజ్ఞప్తి మేరకు పడిగల్ గ్రామంలో ప్రభుత్వం 40 ఎకరాల భూమిని కూడా సేకరించింది. ఈ పార్క్ లో భాగంగా ప్రాసెసింగ్ యూనిట్, గోదాములు, పరిపాలనా భవనం, కంప్యూటర్ ట్రేడింగ్ ఉంటాయి . పసుపు కేంద్రాన్ని మంజూర్ చేసినందుకు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి సిఎంకు, మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి, ఎంపి కల్వకుంట్ల కవితకు ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలియచేసారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here