టాప్ హీరో పైన నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు

0
1503

ఒక్కోసారి సెలెబ్రిటీలు ఎంత బాలన్సుడ్ గా మాట్లాడిన కూడా ఎక్కడో దగ్గర దొరికిపోతుంటారు. ఒకరి గురుంచి గొప్పగా మాట్లాడే క్రమంలో తెలియకుండా వేరొకరిని తక్కువ చేసి మాట్లాడుతారు. ఇటీవల జనతా గారేజ్ ఆడియో లో నిత్యామీనన్ ఎన్టీఆర్ గురుంచి మాట్లాడుతూ ఒక ఫంక్షన్లో ఇంత మంది జనాలను చూడటం మొదటిసారి అని చెప్పింది.ఇక్కడి వరకు ఉంది కానీ అక్కడితో ఆగకుండా ఒక మాట మాట్లాడింది.ఆ మాట ఆమెకు వర్గాల నుంచి వ్యతిరేకమైన నిరసనలు వినబడుతున్నాయి. అదేంటంటే కెరీర్ లో ఒక పెద్ద హీరోతో నటించటం ఇదే మొదటిసారి అని చెప్పుకొచ్చింది. ఈ దెబ్బతో స్టైలిష్ స్టార్ అభిమానులు నిత్యను ఆడుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు అల్లు అర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక చిన్న రోల్ లో నటించింది. రెండు పాటల్లో కూడా బన్నీ తో కలిసి కలుకలిపింది. వరుసగా 4 సినిమాలు విజయవంతమై అందులో ఒకటి 100 కోట్ల సినిమా రెండు 60 కోట్ల సినిమాలు ,ఒకటి 40 కోట్ల సినిమాలు ఉన్నాయని ఇంట కెరీర్ గ్రాఫ్ ఉన్న బన్నీ ,నిత్యా కంటికి పెద్ద హీరోలాగ కనిపించలేదా అని దుమ్మేస్తున్నారు.

వివాదాలకు దూరంగా ఉండే నిత్యా ఇకనైనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here