అకాల వర్షానికి నష్టానికి గురైన రైతులకు సహాయం చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ కి రైతుల విన్నపం

0
40

28/10/2019

ముధోల్:అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ముధోల్ గ్రామ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ అన్నారు.సోమవారం రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రశాంతి IAS, డిప్యూటి తహశీల్దార్ శ్రీకాంత్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకధాటి వర్షాలతో చేతికొచ్చిన మినుము,సోయా,వరి నీటి పాలయ్యాయని పేర్కొన్నారు. పంట ప్రారంభ దశలో వర్షం లేక పంట పెట్టుబడికి అప్పు చేసి ఒకటికి రెండు దఫాలుగా విత్తనాలు విత్తారని ,పంటకు చెదలు పట్టకుండా క్రిమి సంహరక మందులకు డబ్బులు వెచ్చించి రాత్రనక ,పగలనక కాపలా కాసి చేతికందుతుందన్న సమయానికి వర్షపు నీటితో నాశనమైందని,దీంతో రైతులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని వెల్లడించారు.పూర్తిగా వ్యవసాయం పై ఆధారపడి జీవనాన్ని గడిపే రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అదేవిధంగా పత్తి వర్షానికి నీటిలో మునిగి కాయలు నల్లబడి పూర్తిగా నాశనమైందని ,వ్యవసాయ శాఖ అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వం తరపున రైతులకు పంట నష్ట పరిహారం అందేలా చూడాలని వినతిపత్రం లో కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భూమేశ్,నాయకులు రవి,గోవింద్ పటేల్,వ్యవసాయ శాఖాధికారి అజ్మీరా భాస్కర్,రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఏవో agri ఆఫీసర్: అజ్మీరా భాస్కర్
డిప్యూటీ తసీల్ధార్: శ్రీకాంత్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here