తస్మాత్ జాగ్రత్తా…హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్

0
570
New Traffic rules in Hyderabad
New Traffic rules in Hyderabad
    భారతదేశంలో అభివృద్ధిలో ముందున్న మన మహా నగరం హైదరబాద్ ట్రాఫిక్ విషయంలో అనేక కొత్త కొత్త విధానాలను అమలు చేస్తూ ప్రమాదాల నివారణకి ఆచరణాత్మక ఆలోచనలు చేస్తుంది. దీనిలో భాగంగా ఆగస్టు 1వ తేది నుంచి మరో కొత్త విధానాన్ని ప్రవేశ పెట్టనుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలు , ప్రమాదాలను తగ్గించటానికి పాయింట్ల వారీ జరిమానాను విధించాలని నిశ్చయించారు. ఈ విధానం దేశంలో తొలిసారి మన హైదరబాద్ మహా నగరంలో అమలు చేస్తున్నారు.
    ఈ విధానంలో వాహానదారులు రెండేళ్ళలో 12 పాయింట్లు దాటితే సంవత్సరం పాటు లైసెన్స్ రద్దు చేయనున్నారు. ఇలా లైసెన్స్ రద్దయ్యాక కూడ వాహానాన్ని నడిపితే జైలు శిక్ష విధించనున్నారు. అలాగే 2 సార్లు 12 పాయింట్లు దాటితే 2 సంవత్సరాలు, 3వ సారి అయితే 3 సంవత్సరాల పాటు లైసెన్స్ రద్దు చేయనున్నారు.

ఈ కొత్త రూల్స్ అమలయితే కొంత వరకు ట్రాఫిక్ ఉల్లంఘనలు, ప్రమాదాలు తగ్గవచ్చు అని అధికారులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here