కొత్త హెచ్చరికలతో ఐటీ డిపార్ట్ మెంట్…

0
380
new rules in it department
new rules in it department

నగదు లావాదేవీలపైన ఐటీ డిపార్ట్ మెంట్ కొత్త హెచ్చరికలు తీసుకొచ్చింది. రూ.2 లక్షల కన్నా ఎక్కువ నగదు స్వీకరించే వారి నుంచి అంతే మొత్తం జరిమానాగా వసూలు చేస్తామని తెలిపింది. అంతే కాకుండా ప్రజలకు ఈ రకమైన భారీ నగదు లావాదేవీల గురించి సమాచారం తెలిస్తే blackmoneyinfo@incometax.gov.in తమకు తెలియజేయాలని కోరింది. బ్యాంకులు, పోస్టాఫీసులు, కోపరేటివ్‌ బ్యాంకులు, ఆదాయపన్ను శాఖలు తీసుకునే మొత్తాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు వుంటుంది. 2017–18 కేంద్ర బడ్జెట్‌లో రూ.3 లక్షలు అంతకుమించి నగదు లావాదేవీల నిర్వహణ ఉండగా దాన్ని రూ.2 లక్షలకు తగ్గించి ఆర్థిక బిల్లులో సవరణ చేర్చారు. దీనికి అనుగుణంగా ఆదాయపన్ను చట్టంలో సెక్షన్‌ 269ఎస్‌టిని చేర్చారు. ఒక్క లావాదేవీ లేదా ఒకటి కన్నా ఎక్కువ లావాదేవీల మొత్తం రూ.2 లక్షలు నగదు రూపంలో చెల్లించడం, తీసుకోవడం చట్ట విరుద్ధం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here