బ్రేకింగ్ న్యూస్ :10 మంది రాష్ట్ర మంత్రుల రాజీనామా

0
561
Naveen patnaik sensation decision on his ministry
Naveen patnaik sensation decision on his ministry

ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించే పనిలో పడ్డారు . దీనిలో భాగంగా తన మంత్రి వర్గంలోని పది మంది మంత్రులు రాజీనామ చేసారు. అరుణ్‌ సాహూ,సంజయ్‌ దాస్‌బర్మ, సుడం మార్నిది, ప్రణబ్‌ ప్రకాశ్‌ దాస్‌, లాల్‌ బిహారీ హిమ్రిక, ప్రదీప్‌ పాణిగ్రాహి, పుష్పేంద్ర సింగ్‌దేవ్‌, జోగేంద్ర బెహ్రా, దేవీ ప్రసాద్‌ మిశ్రాలు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. స్పీకర్‌ నిరంజన్‌ పుజారి సైతం తన పదవికి రాజీనామా చేశారు.
ఒడిశా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ప్రదీప్‌ అమాత్‌ కూడ రేపు తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉంది. ఈయనకు స్పీకర్‌గా అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here