తనకు తానూ చెక్కుకొని జిల్లా గల్ఫ్ నిరుద్యోగులకు అండగా నిలిచిన ఇందూర్ యువకుడు

0
348

లక్ష్యాలు సాధించటంలో సమాజంలో వివిధ రకాల రకాలు ఉంటారు.కొందరు ఉన్నత కుటుంభంలో పుట్టి చుట్టూ ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ పైకి వస్తుంటారు. మరి కొందరు పేద మధ్య తరగతి కుటుంబంలో పుట్టి నిర్ధిష్టమైన లక్ష్యాలను పెట్టుకొని,గాడ్ ఫాదర్ లేకుండా పరిస్థితులతో ఏకలవ్య శిష్యరికం చేస్తూ విజయం సాధిస్తారు.అయితే ఇలాంటి వాళ్లలో చాలా మంది విజయం సాధిస్తూన్నా కూడా సమాజం తనకు కష్టాల్లో ఉన్నపుడు పట్టించుకోలేదని ఇతరులకు సహాయం చేయకుండా తన పని తాము చేసుకుంటూ పోతారు. కాని కొంత మంది విజేతలు మాత్రం తన విజయానికి మూలకారణమైన సమాఅందిన జానికి ఎదో విదంగా సహాయం చేస్తూ తనలాగా పేదరికంలో ఉండి కష్టపడే వాళ్లకు బాసటగా నిలబడే వాళ్ళు అరుదుగా ఉంఅలంటి టారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి మండలానికి చెందిన నవీన్ కోటగిరి. అయన కష్టాలతో కూడిన విజయగాథ ఏంటో చూద్దాం.

ఇతని బాల్యం చాలా కష్టాలతో దయనీయంగా గడిచింది.ఉండడానికి ఇల్లు లేక అద్దె ఇళ్లల్లో ఉంటూ తల్లిదండ్రులు ఒక్కపూట తింటూ ఒక్కపూట పస్తులుంటు, నాన్న టైలర్ గా అమ్మ బీడీలు చుడుతూ కష్ట పడుతున్నగాని కుటుంబ ఆర్థిక పరిస్థితులు పెను భారంకావడంతో ఇంటికి పెద్దకొడుకు భాధ్యత తీసుకుని చిన్నవయసులోనే కష్టాల్లో తాను పాలుపంచుకుంటు ఒకపక్క చదువు కొనసాగిస్తూ బాల్యంలోనే మరోపక్క పేపర్ బాయ్ గా, టెంట్ హౌస్ పనివాడిగా, సౌండ్స్ లైటింగ్ లో అసిస్టెంట్ గా, రోజువారీ కూలీగా ( టెలిఫోన్ బూత్ లో, కట్టెలు తెచ్చి అమ్మడం, ఎర్రమట్టి తెచ్చి అమ్మడం, వ్యవసాయ కూలిపనులకు) వెళుతూ, మోటర్ వైండింగ్, హౌస్ వైరింగ్, ఎలక్ట్రికల్ పనులు నేర్చుకుంటూ, మ్యూజిక్ సెంటర్లో పనిచేస్తూ చదువు లో కూడా ముందుండి పదవ తరగతి బోర్డ్ పరీక్షల్లో పాఠశాల టాపర్ గా నిలిచాడు.

చిన్నవయసులోనే ఆధ్యాత్మిక గురువు శ్రీ పాండురంగ శాస్త్రి – దాదాగారి స్వాధ్యాయా కేంద్రం వెళుతూ మహనీయుల చరిత్రలు తెలుసుకుంటూ వారి యొక్క బాటననుసరించి పట్టుదలతో కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించ వచ్చని గ్రహించి, తను ఎలాగైనా గొప్పస్తాయికి ఎదగాలని, కుటుంబాన్ని సుస్థిర స్థానంలో ఉంచాలని బాల్యంలోనే సంకల్పించాడు .

గ్రామంలోనే ఎలక్ట్రికల్ పనుల శిక్షణ పొంది ఇంటర్ చదువుతూనే స్వయంఉపాధితో సొంతంగా షాప్ పెట్టి ఎలక్ట్రికల్ వస్తువులు రిపేర్, హౌస్ వైరింగ్, పెళ్లిళ్లకు ఉత్సవాలకు సౌండ్ లైటింగ్ డెకరేషన్ పనులు చేయడం ప్రారంభించాడు.
రోజులు గడిచే కొద్దీ ఇంత కష్టపడుతున్న ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారడంతో కుటుంబ బాధ్యత పెరగడంతో డిగ్రీ మూడవ సంవత్సరంలో ఆపేసి గల్ఫ్ బాట పట్టాల్సి వచ్చింది.

గల్ఫ్ లో ఉద్యోగము కోసం ఒక ఆధ్యాత్మిక చిరకాల మిత్రుని సహాయంతో గల్ఫ్ చేరుకున్నాక, కొందరి స్నేహితుల సహకారంతో ఒక గొప్ప కంపనీ తెలంగాణ మేనేజర్ చొరవతో *గల్ఫ్ క్రాఫ్ట్ ఇంటర్ నేషనల్ యాట్స్ కంపెనీ* లో ఎలక్ట్రీషియన్ అసిస్టెంట్ గా ఉద్యోగం లో చేరాడు.
పనిలో తన ప్రతిభను చూపుతూ ఓవర్ టైం ఎక్కువగా చేస్తూ అంకితభావంతో పనిచేస్తూ అనతికాలంలోనే అసిస్టెంట్ నుండి ఎలక్ట్రీషియన్ గా, ఛార్జ్ హాండ్ గా, సూపర్ వైసర్ గా, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా, ప్రోమోషన్స్ పొందుతూ, బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డ్ తీసుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ కంపెనీ అభివృద్ధి లో తనవంతు పాత్ర పోషిస్తూ తనకు సహాయపడిన వారిని మరిచిపోకుండా కృతజ్ఞత భావంతో ఉంటూ తనకున్న ఆర్థిక సమస్యలు కొద్ది కొద్దిగా మెరుగుపరుచుకుంటు అంతటితో ఆగకుండా తన తొడబుట్టిన చెల్లెలు పెళ్లి చేసాడు. స్వభావాన్ని మెచ్చిన తన బందువులలో ఒకరు ఆయన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయదలిచాడు, అంతలోనే ఆయన అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడంతో మరో బాధ్యత తనపై పడింది. తను చేసుకునే అమ్మాయిని తన సొంత డబ్బులతో బి-టెక్ చదివించి పెళ్లి చేసుకున్నాడు.

తను గల్ఫ్ క్రాఫ్ట్ ఉద్యోగంలో ఉండగా తన ప్రతిభను గుర్తించిన దుబాయ్ లోని ఒక ప్రముఖ ఎస్ ఎఫ్ యాట్స్ కంపెనీ వారు మంచి వేతనం ఇవ్వడముతో అందులో సర్వీస్ టీం ఇంచార్జ్ గా చేరాడు. అందులో కూడా కృషితో నాస్తి దుర్భిక్షం కు దీటుగా పనిచేస్తున్న దశలో తన పని నైపుణ్యాన్ని గ్రహించిన కంపెనీ యజమాని సర్వీస్ టీం ఇంచార్జ్ నుండి మిడిల్ ఈస్ట్ సర్వీస్ మేనేజర్ గా నియమించారు.
తన పనిలో భాగంగా దుబాయ్ యే కాకుండా ఒమాన్, సౌదీఅరేబియా, కువైట్, కతర్, సీసెల్స్, సౌత్ ఆఫ్రికా, బెహరిన్, కిష్ ఇరాన్ మొదలగు దేశాలు పలుమార్లు చుట్టుముట్టాడు.

తన కుటుంబాన్ని ఆర్థికంగా స్థిరపరచి, ఒక పెంకుటిల్లు కొని కుటుంబాన్ని అద్దె ఇంటినుండి సొంత ఇంటికి మార్చాడు. ఈ తరుణంలో ఎంతో మందికి గల్ఫ్ లో ఉద్యోగావకాశాలు కల్పిస్తూ, కొత్తగ వచ్చిన వారికి మరియు సమస్యలకు భయపడేవారికి మోటివేషన్ చేస్తూ, ధైర్యం నింపుతూ, సలహాలిస్తూ, పలువిధాలుగా సహకారాలందించడమే కాకుండా ఆర్థిక సహాయం అందిస్తూ వచ్చాడు.ఇంతలో తన కంపెనీ బహరైన్ లో స్థాపించిన నూతన కంపెనీ కి మేనేజర్ గా తన ధర్మపత్ని తో సహా బహరేన్ లో నివాసముండేంతగ ఎదిగాడు. ఐకమత్యమే మహాబలం అని ఒకరికొకరం తోడుగా ఉండాలని బెహరిన్ లో ఉన్న ప్రవాస భారతీయులందరిని యూనిటీ చేయడంలో సీనియర్ వ్యక్తుల సలహాలు తీసుకుంటూ వారితో కలిసి తనవంతు కృషి చేశాడు. అడిగిన వెంటనే కాదనకుండా సమస్యల్లో ఉన్న పేదవారికి ఎంతోమందికి బాసటగా నిలిచాడు.

ఇదిలా ఉండగా ఇతని హర్డ్ వర్క్ నేరుగా గమనించిన ఆస్ట్రేలియా లో ఉన్న ఒక రివేర యాట్స్ కంపెనీ ఓనర్ మేనేజర్ గా(ఆస్ట్రేలియా) ఉద్యోగ అవకాశం కల్పించగా, అదే సమయంలో వ్యక్తిత్వాన్ని తెలుసుకున్న బహరేన్ లో ప్రముఖులు నివసించే అంవాజ్ ఐలాండ్ ఓనర్ ఎన్నో ప్రముఖ కంపెనీలు గల అలీ మాతృక్ పిలిచి అంవాజ్ మెరినాకు ఆపరేషన్ మేనేజర్ గా ఉండాలని సూచించిన సూచన మేరకు ఆస్ట్రేలియా ఉద్యోగం వదులుకుని అంవాజ్ ఆపరేషన్ మేనేజర్ గా బాధ్యతలు తీసుకుని తన మెరుగైన ఆలోచనలతో తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా, ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటు సక్రమంగా విధులు నిర్వహిస్తూ, అంవాజ్ మెరినాను అభివృద్ధి చేస్తూ, తనకున్న మానవత దృక్పథంతో మన దేశ ప్రవాసులకే కాకుండా ఇరుగుపొరుగు దేశ పేద వ్యక్తులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాడు.

తనలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆధ్యాత్మిక సహోదారునికి, మరియు ఒకప్పుడు తనతో కలిసి పనిచేసిన వారిని మరువకుండా సమస్యల నుండి గట్టెక్కించడానికి తన కంపెనీ ఓనర్ తో మాట్లాడి వీరికోసం కొత్త యాట్స్ సర్వీస్ కంపెనీ ప్రారంభించి, ఊహించని మంచి వేతనాలతో విలువైన స్థానంలో ఉంచి తన మానవీయతను చాటాడు.తన కొందరి స్నేహితులకు గల్ఫ్ లో వ్యాపారం చేయడానికి తను ఎంతో దోహదపడ్డాడు.ఇలా ఎంతో మందికి ఎన్నో విధాలుగా చేదోడువాదోడుగా ఉంటున్నాడు. వ్యాపార రంగంలో రాణించాలని తను కూడా తన మిత్రులతో కలిసి కొంత మందికి ఉపాధి కల్పించాలని రెండు రెస్టారెంట్లు మరియు కంట్రాక్షన్స్ స్థాపించి ఉపాధి కల్పిస్తున్నారు.

ఒక నెల వ్యవధి లోనే ఎన్నికల్లో ఓటు వేయడానికి రెండుసార్లు జన్మభూమికి వచ్చి ఓటు వేసి ఓటు హక్కు నా జన్మహక్కు అని చాటాడు.
తనకు పరిచయమున్న బెహరిన్ కు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అధికారుల సహకారంతో తనకు వీలయినంత గల్ఫ్ బాధితులను ఆదుకుంటు అండగా ఉంటున్న నీకు హ్యాట్సాఫ్.ఒక సాధారణ స్ధాయి నుండి తను సంకల్పించిన సంకల్పం కోసం పట్టు విడవకుండా కష్టపడి ఉన్నత శిఖరాలను అధిష్టించి సంకల్పాన్ని నెరవేర్చుకుని గ్రామం యొక్క పేరును ఎల్లలు దాటించి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు నవీనకుమార్ కోటగిరి.
విజయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఇతన్ని నేటి యువత రోల్ మోడల్ గా తీసుకుని కష్టమని తలవకుండా ఇష్టంతో పనిచేస్తూ మంచి గమ్యాన్ని చేరాలని ఆశిస్తూ…..
తను రాష్ట్ర, దేశ పేరును నిలబెట్టేంతగా ఎదగాలని ఆకాంక్షిద్దాము.

రచయిత :నగేష్ బాశెట్టి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here