జాతీయ స్కూల్ క్రికెట్ కి పెరుగుతున్న ఆదరణ

0
389

నేషనల్ స్కూల్ క్రికెట్ కౌన్సిల్, స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా వాళ్ళ సహాయంతో దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ కి మంచి ఆదరణ లబిస్తుంది. మన దేశంలో క్రికెట్ కి ఉన్న ఆదరణ దేనికి లేదని జగమెరిగిన సత్యం,ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నగరాల కన్నా ఎక్కువ చూస్తారు . ఒక విదంగా చెప్పలేంటే వాళ్ళు క్రికెట్ చూడటం ఆపేస్తే క్రికెట్ మ్యాచ్ ల TRP రేటింగ్ లు పాతాళానికి వస్తాయనేది ఒప్పుకోవాల్సిన నిజం. కాని క్రికెట్ ఆడటంలో గ్రామీణ ప్రాంతాలకి పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా 60 ఏళ్లలో హైదరాబాద్ మినహించి మిగత జిల్లాల నుంచి ఒక్క క్రికెటర్ కూడా భారత జట్టు కు ఆడలేదు . ఇలాంటి సమయంలో జాతీయ స్కూల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ జాతీయ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ మించిన ప్లాట్ ఫాం లేదు.

దేశం మొత్తం జిల్లా స్తాయి నుంచి టాలెంట్ ప్రోగ్రాం ని పెట్టి ,చివరికి దేశం మొత్తంలో 50 మంది ప్రాబబుల్స్ ని ఎంపిక చేసి డెహ్రాడున్ లో ట్రైనింగ్ ఇచ్చి చివరికి 15 మంది తో భారత స్కూల్ క్రికెట్ జట్టు తయారు చేస్తారు . ఒక విదంగా చెప్పాలంటే ఇది చరిత్రాత్మకైన టోర్నమెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే దేశంలో ఇలాంటి టోర్నీ జరగలేదు అది కూడా దేశం మొత్తం ఒకే రోజున మొదలు పెట్టటం నిజంగా గొప్ప విషయం.
డిసెంబర్ మొదటి వారం నుంచి మొదలు కానున్న టోర్నీ కి చేతన్ శర్మ చైర్మెన్ గా వ్యవహరించటం ,తెలంగాణా కి క్రికెట్ అసోసియేషన్ అఫ్ తెలంగాణా(CAT) సెక్రటరీ సునీల్ బాబు కి ,ఆంద్ర లో విన్సెంట్ వినయ్ కుమార్ కి బాద్యతలు అప్పగించారు. జిల్లాల్లో స్కూల్ రిజిస్ట్రేషన్ నవంబర్ 25 వరకు చేసుకోవచ్చు . జాతీయ స్కూల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళ ఈ ప్రయత్నం ఫలించి ,దేశానికి ఎందరో సచిన్,కాంబ్లి లను ఇవ్వాలని ఆశిద్దాం ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here