బాల్కొండ వ్యవసాయాన్ని దారితప్పిస్తున్న జాతీయ రహదారి

0
681

పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అంటుంటారు. పట్టణీకరణ,నగరీకరణ ,గ్లోబలైజషన్ కూడా దేశం ముందుకు వెళ్ళటానికి దోహదపడతాయి. అయితే ఈ రెండు ఒకదాని వల్ల మరొకదానికి సమస్య కానంత ఏం కాదు. కాని ఒక్కోసారి పట్టణీకరణవల్ల ఆ కొమ్మలకు గాయం కల్గుతుంది. పల్ల్లెల్లో ఉన్న రైతాంగం నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రధానంగా రోడ్ల విస్తరణలో రైతులు నష్టపోతుంటారు. వాస్తవానికి రోడ్ల వల్ల ప్రజలకు రవాణా వసతి కలగటం వలన అభివృద్ధి జరుగుతుంది. కాని రోడ్ల విస్తరణలో రైతులకు నష్టం ఎక్కువ జరుగుతుంది. తాము ప్రాణానికి ప్రాణం లాగా చూసుకున్న భూములను,తరాలు మారినా కూడా భూములను తమ స్వంత కుటుంభ సభ్యులుగా భావించి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భూములను అమ్ముకోని కుటుంబాలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కనబడతాయి. కాని అలాంటి భూములు రోడ్ల విస్తరణలో పొతే ఆ బాధ వర్ణనాతీతం. నష్టపరిహారం ఎంత ఇచ్చినా వేరే భూమిని బదిలీ ఇచ్చినా వాళ్ళ బాధ తీరేది కాదు.

ఇపుడు ఇలాంటి పరిస్థితి బాల్కొండ నియోజకవర్గంలో వచ్చి పడింది. వేంపల్లి నుంచి మంచిర్యాల వరకు 4 లైన్ల రోడ్ నిర్మాణం గురుంచి హుటాహుటిన సర్వే చేసి కేంద్ర ప్రభుత్వ అధికారులు సరిహద్దు రాళ్లను పాతడం జరిగింది.ఎవరికీ నోటీసులు ఇవ్వకుండా ఇలా రాళ్లను పాతేసరికి రైతుల గుండెల మీద ఒక్కసారి రాళ్లు పడినట్లు అయ్యాయి.వేంపల్లి ,రేంజర్ల ,తిమ్మాపూర్ ,తొర్తి ,వర్షకొండ,శెట్పల్లి లాంటి ఎన్నో గ్రామాల భూములు పోనున్నాయి. వందలాది రైతుల జీవనోపాధి కోల్పోయే అవకాశం ఉంది.వాస్తవానికి అక్కడ వ్యవసాయ భూములు రియల్ రంగాన్ని తలపిస్తాయి. ఎంత పరిహారం ఇచ్చినా కూడా సరిపోదు.
ఐతే ఈ సంఘటనతో వెంటనే మేల్కొన్న భూములు కోల్పోతున్న రైతులు యూనిటీ గా మారి ఒక సంఘంలాగా మారి తమ బాధ ను కలెక్టర్ కి విన్నవించుకోవాలని సిద్ధమౌతున్నారు. తగిన న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here