మోడీనీ నవ్వించిన అక్షయ్ టైటిల్

0
632
Narendra modi more laugh by akshay new film title
Narendra modi more laugh by akshay new film title

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ చెప్పిన తన సినిమా టైటిల్ కి ప్రధాని మోడీ ఒక్క సారిగా నవ్వడం మొదలెట్టాడు.
నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘స్వచ్ఛ భారత్‌’ మిషన్ లో భాగంగా అక్షయ్ కుమార్ ఒక సినిమాని తెర కెక్కిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ “టాయ్‌లెట్‌ – ఏక్‌ ప్రేమ్‌కథా” గా ఖరారు చేసారు. నరేంద్ర మోడీ ని కలిసి సినిమా గురించి వివరించారు నటుడు అక్షయ్ కుమార్. నరేంద్ర మోడీ ని కలిసిన క్షణం, ఆయన నవ్విన ఆ క్షణాన్ని మరచిపోలేని సంఘటన అని అక్షయ్ కుమార్ ఫేస్ బుక్ ద్వారా తెలియగేసారు. ఈ సినిమాకి శ్రీనారాయణ్‌ సింగ్‌ దర్శకత్వం వహించగా భూమి పెడ్నేకర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమా జూన్ 22న ప్రేక్షకుల ముందికి రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here