ఈ ప్రేమ కావాలంటే కొంచెం దిమాక్ ఉండాలి

0
453

ఈ ప్రేమ కావాలంటే కొంచెం దిమాక్ ఉండాలి
పైన స్టేట్మెంట్ అర్థం చేసుకోవటానికి దిమాకు అవసరం లేదేమో కాని సుకుమార్ సినిమాలను అర్థం చేసుకోవటానికి మాత్రం ప్రేక్షకుడికి కొంచెం దిమాక్ ఉండాలి ఎందుకంటే తన రాతలతో నాయిక నడుముని జామెట్రీ గీతలతో పోల్చటం ,తన స్కీన్ ప్లే తో ప్రేక్షకుడికి పజిల్ పెట్టటం ,తన సినిమా లోని పాత్రలతో ప్రేక్షకుడి ని లెక్కల తరగతిలోకి తీసుకెళ్ళి వినోదాన్ని ఇవ్వటం లాంటివి సుకుమార్ సినిమాల్లోనే కనిపిస్తాయి. ఇవి ప్రేక్షకుడికి నచ్చితే (అర్థం అయితే) సినిమా ని 100 సార్లు చూస్తారు నచ్చకపోతే ఎన్నో సార్లు విమర్శిస్తారు . దీనికి నిలువెత్తు సాక్ష్యం 1 సినిమా ,మహేష్ అద్బుతమైన నటన తో ,సుకుమార్ పజిల్ కథనం తో విడుదలైన ఈ సినిమా మేదవుల కోసం తీసినట్లు అనిపించింది దానితో చాల మంది సినిమాను చూడక మహేష్ కెరీర్ లో డిజాస్టర్ గా మిగిలింది కాని TV లో వచ్చేటపుడు మాత్రం గొప్ప సినిమా అని ప్రసంసలు వచ్చాయి. ఇలాంటి సందర్బంలో టెంపర్ తో ఊపు మీదున్న ఎన్టీఆర్ తో సుకుమార్ తీసిన సినిమా ఎలా ఉందొ ఒకసారి చూద్దాం .

కథ
లండన్ లో ఉండే రాజేంద్ర ప్రసాద్(రమేష్ చంద్రప్రసాద్‌0 కి ముగ్గురు కొడుకులు వారిలో ఎన్టీఆర్ (అభిరామ్ )ఒకడు . ఓసారి అభిరామ్ ఆఫీసు పనిమీద స్పెయిన్‌లో ఉండగా అభిరామ్ తండ్రి రమేష్ చంద్రప్రసాద్‌కి ఆరోగ్యం బాగాలేదని తెలియగానే అభిరామ్ బయలుదేరి వస్తాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన చంద్రప్రసాద్ ద్వారా తను ఆ పరిస్థితికి రావడానికి కారణమైన కృష్ణమూర్తి (జగపతిబాబు) గురించి తెలుసుకుంటాడు. అప్పుడే రమేష్ చంద్రప్రసాద్ తన పిల్లలని ఓ కోరిక కోరతాడు. అలా తండ్రి కోరికను నెరవేర్చడానికి తిరిగి లండన్ బయలుదేరుతాడు అభిరామ్. అలాగే కృష్ణమూర్తికి–అభిరామ్‌కి మధ్య జరిగిన గేమ్ ఏంటి.? తండ్రి కోరిన కోరికను అభిరామ్ తీర్చాడా లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..

విశ్లేషణ :
1 సినిమా తర్వాత సుకుమార్ సినిమా చూడాలంటె కొంచెం మేదస్సు ని పెంచుకోవాలనే ప్రేక్షకుల్లో ఒక విమర్శ ఉంది కాని ఇందులో మాత్రం కథ ని సులబం చేసి కథనానికి మాత్రం లెక్కలు పెట్టాడు దాని వలన ప్రేక్షకుడికి ఇబ్బంది లేకుండా సినిమా తీసాడని చెప్పొచ్చు. 1 లో లాగా అడ్డమైన ఫ్లాష్ బ్యాక్ లు లేకుండా ప్రేక్షకుడికి ఇబ్బంది లేకుండా చేయటం ద్వారా తను చేసిన తప్పుని సరిదిద్దుకుంటూ తన టాలెంట్ మాత్రం ప్రదర్చించాడు .

ఇక జూనియర్ ఎన్టీఆర్ గురుంచి చెప్పాలంటే పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు ,ఒకప్పుడు కేవలం మూస పాత్రలకే పరిమితం ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక ప్రయోగాత్మకమైన పాత్ర చేసాడు. ఇక డాన్స్ లు గురుంచి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక జగపతి బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్టీఆర్ పాత్రకైనా ఇంకొకరిని ఊహించుకోగలమేమో కానీ.. జగపతి స్థానంలో ఎవ్వరినీ ఊహించే సాహసం చేయలేం.రాజేంద్ర ప్రసాద్ కు తన టాలెంట్ చూపించే అవకాశం పెద్దగా లేకపోయింది. ఉన్నంతలో బానే చేశారు. రాజీవ్ కనకాల – అవసరాల శ్రీనివాస్ కూడా ఆకట్టుకున్నారు.రకుల్ గ్లామర్ పాత్రలో బాగా చేసింది. రాజీవ్ కనకాల – అవసరాల శ్రీనివాస్ కూడా ఆకట్టుకున్నారు.

ప్లస్ పాయింట్స్
ఎన్టీఆర్
జగపతి బాబు
ఫస్ట్ హాఫ్
సాంగ్స్

మైనస్ పాయింట్స్
కథ
సాగదీసిన సెకండ్ హాఫ్

verdict : ఈ ప్రేమ కావాలంటే కొంచెం దిమాక్ ఉండాలి
రేటింగ్:3. 5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here