ఆరోగ్యశ్రీ అని చెప్పి అవిటితనాన్ని బహుమానంగా ఇచ్చారు

0
953

 

పాతకాలంలో ఒక వ్యక్తికి కొండనాలుకలో మంట వస్తే ఒక వైద్యుడిని కలిసి తన సమస్యను చెప్పితే,వైద్యం చేశాక కొండనాలుక బదులు ఉన్న నాలుక పోయిందట. అందు కోసమే కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట అని సామెత చాలా ప్రాచుర్యంలో ఉంది. నిజానికి ఇది సామెత పుట్టినపుడు మన దేశంలో వైద్యం పరిజ్ఞానం లేకపోవటం వలన ఇలాంటి చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయేమో. కాని ఈ ప్రపంచీకరణ కాలంలో ,కంప్యూటర్ ముందు పెట్టుకొని రోబోలతో ఆపరేషన్లు చేసే ఈ కాలంలో కూడా చేదు సంఘటనలు ప్రతి రోజు చాలా జరుగుతున్నాయి. ఇపుడు ఇలాంటి సంఘటన నిజామాబాదు జిల్లాలో నందిపేట పట్టణంలో జరిగింది అదేంటో చూద్దాం.

 

నాగం గంగమని నందిపేట్ వాసి నిరుపేద వృద్ధురాలు కాలు నొప్పిగా వుంది అని నిజామాబాద్ మోతీలాల్ హాస్పిటల్ కి వెళ్ళింది . అక్కడ ఆరోగ్య శ్రీ లో ఆపరేషన్ చేస్తాము అని చెప్పి ఆపరేషన్ కి సిద్దం చేశారు. ఐతే ఆపరేషన్ చేసే సమయానికి ఇది ఆరోగ్య శ్రీ కి వర్తించదు 40000 రూపాయలు చెల్లించాలి అని చెప్పటంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. దీంతో గత్యంతరం లేక అప్పు తెచ్చి డబ్బులు చెల్లించి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ లో భాగంగా స్టీల్ రాడ్ వేసినట్లు సమాచారం. తీరా ఆపరేషన్ అయ్యాక ఆపరేషన్లో లోపం జరిగిందని మోకాలు కి ఆపరేషన్ చేస్తే పూర్తిగా నయమౌతుందని వైద్యులు చెప్పారట. ఈ ఆపరేషన్ కి డబ్బులు అవసరం లేదని దీనికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పినట్లు సమాచారం. దీనితో తేరుకున్న కుటుంబ సభ్యులు శివ సాయి ఫౌండేషన్ మోర్థాడ్ అధినేత గంగ ప్రసాద్ కి సమాచారం ఇవ్వగా ,అయన తెలంగాణ కబుర్లు డైరెక్టర్ రాజశేఖర్ ర్యాడా కు ,నిజామాబాదు జిల్లాకు చెందిన సంఘ సేవకులు ఆకుల మోహన్ ని వెంటబెట్టుకొని బాధితురాలిని సందర్శిస్తే ఆమెకు నడవటం రావటం లేదని ,పరిస్థితి ఘోరంగా ఉందని వాళ్ళు తెలుసుకున్నారు.

అంతే కాకుండా శివ సాయి ఫౌండేషన్ మోర్థాడ్ తరపున 5000 రూపాయలను సహయం చేయడం జరిగింది.ఈ విషయాన్నీ ప్రసాద్ మీడియా కి తెలియచేసి ఆమెను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరాడు.

Author: Ravinder Ryada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here