తెలంగాణ రైతు ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసిన my village show

0
2118

ఒకప్పుడు రైతు,వ్యవసాయం అనే పదాలకు ప్రపంచంలో చిన్న చూపు ఉండేది. ప్రధానంగా భారతీయ రైతులు అంటే కేవలం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారుగా,పట్టణీకరణ తెలియని వాళ్ళుగా,చదువురాని వాళ్ళుగా నగర ప్రజల నుంచి ఒక వివక్ష ఉండేది.వాస్తవానికి రైతు లేకపోతె తిండి పెట్టేవాడు లేడని తెలిసినా కూడా ఒక చిన్న చూపు ఉంటుంది. కాని ఈ మధ్య రైతుల విలువ నగర ప్రజలు తెలుసుకుంటున్నారు. ప్రధానంగా సాఫ్ట్ వెర్ ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రత పైన అనుమానాలు ఎక్కువ కావటంతో ఏదైనా పార్ట్ టైం వ్యాపారం చేద్దామని అనుకున్నపుడు ఆర్గానిక్ వ్యవసాయం వైపు తమ చూపు మరలటంతో వ్యవసాయం మీద ఇష్టం ఏర్పడి వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తున్నారు. అదే కాకుండా కెసిఆర్, పవన్ కళ్యాణ్ ,ప్రకాష్ రాజ్ లాంటి ప్రముఖులు వ్యవసాయం అనేది తమ ప్రవృత్తిగా మార్చుకోవటంతో నగర ప్రజల మనసత్త్వం మారిపోయింది.

ఐతే ఈ మధ్య కొన్ని సంస్థలు రైతుల గురుంచి విభిన్న రీతిలో ప్రదర్శనలు ఇస్తున్నారు. సృజనాత్మకంగా రైతుల గోడును ప్రపంచానికి తెలియచేస్తున్నారు. ఆ మధ్య హైదరాబాద్ లో జరిగిన IPL క్రికెట్ మ్యాచులో సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ అనే సంస్థ స్టేడియం లో పచ్చ కండువాలు వేసుకొని విభిన్నరీతిలో ప్రదర్శన ఇస్తూ, IPL ఫైనల్ మ్యాచును రైతుల కోసం చారిటి గా నిర్ణహించాలని కోరారు. ఇపుడు గ్రామంలోని ఆత్మను తెలుగు ప్రజలకు తమ యూట్యూబ్ ఛానల్ my village show ద్వారా తెలియచేస్తున్న కరీంనగర్ జిల్లాలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ ,గీలా అనిల్ కుమార్ , పిల్లా తిరుపతి లు పొలంలో గొర్రు (అదో రకం నాగలి ) ని నడుపుతూ డాన్సులు చేసి కికి ఛాలెంజ్ ద్వారా ప్రపంచానికి తెలంగాణ రైతుల ఆత్మను పరిచయం చేశారు.
అసలు కికి ఛాలెంజ్ విషయానికొస్తే కదిలే కారు నుంచి కిందికి దిగి రోడ్డుపై డ్యాన్స్ చేసి దానిని చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడమే ఈ చాలెంజ్.దీని వలన చాల ప్రమాదాలు జరిగాయి. దీనిపైనా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. కాని ఇందుకు భిన్నంగా అనిల్,తిరుపతి లు పొలంలో ఎడ్లతో గొర్రు రొప్పుతూ డాన్స్ చేసి వీడియో తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయటం ద్వారా అప్పటి వరకు నెగటివ్ కోణం ఉన్న కికి ఛాలెంజ్ ని పాజిటివ్ గా కూడా చేయొచ్చు అని ప్రపంచానికి చెప్పి రైతులను ప్రమోట్ చేయటం జరిగింది.
వీళ్ళ డాన్సుకు సృజనాత్మకత కు ఫీదా అయిన దక్షిణాఫ్రికా కమెడియన్‌ ట్రెవర్‌ నోహ్‌ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయటం జరిగింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా తెలంగాణ రైతుల కికి చాలెంజ్‌ను చూసి దేశీ స్టైల్లో బాగా చేశారని మెచ్చుకొని , ‘మేరా భారత్ మహాన్’ అంటూ ట్విట్ చేశాడు . ఇప్పటి వరకు యూట్యూబ్ స్టార్లుగా ఉన్న my village show ప్రతినిధులు ఇపుడు ఇంటర్నేషనల్ స్టార్లుగా అయ్యారు. భవిష్యత్తులో భారతీయ ఆత్మను ప్రపంచానికి పరిచయం చేసే కార్యక్రమాలు ఇంకా చేయాలనీ కోరుకుందాం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here