బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు నిరాకరించిన ముమైత్‌…

0
275
Mumaith Khan has refused to give her blood samples.
Mumaith Khan has refused to give her blood samples.
    డ్రగ్స్‌ కేసులో గురువారం (జులై 27) సినీనటి ముమైత్ ను నలుగురు మహిళా అధికారులు ఆరున్నర గంటలపాటు విచారించారు. విచారణలో డ్రగ్స్ కేసుకు సంబంధించి అనేక విషయాలపై ఆమెను ప్రశ్నించారు. ఈ విచారణలో ప్రధానంగా డ్రగ్స్‌ ముఠా నాయకుడు కెల్విన్‌తో ఆమెకు ఉన్న పరిచయాలపై ప్రశ్నించారని తెలిసింది. కెల్విన్‌ సెల్‌ఫోన్‌లో ముమైత్‌ఖాన్‌ ఫోన్‌ నంబర్‌ ఉండటంతో పాటు వీరిద్దరి మధ్య వాట్సాప్‌ చాటింగ్‌ వివరాలకు సంబంధించిన అంశాలను అధికారులు సేకరించినట్టు సమాచారం.హైదరాబాద్ నుంచి ముంబైకి ఎందుకు వెళ్లారన్న విషయాలను విచారణలో భాగంగా ముమైత్ ను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా గోవా, బ్యాంకాక్ లకు ఎందుకు వెళ్తారన్న సిట్ ప్రశ్నలపై ముమైత్ క్లారిటీ ఇచ్చారు. పబ్ లకు వెళ్లే అలవాట్లతో పాటు తీరిక వేళల్లో ఏం పనులు చేస్తుంటారన్న విషయాలను విచారణలో ఆమె చెప్పినట్లు సమచారం.
    డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ముమైత్ ఖాన్ నుంచి అధికారులు ఎలాంటి శాంపిల్స్‌ సేకరించలేదని సమాచారం. వెంట్రుకలు, గోళ్లు, రక్తం శాంపిల్స్‌ ఆమె ఇచ్చేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here