కెసిఆర్ అడుగుజాడల్లో ముద్రగడ

0
421

తెలంగాణా ఉద్యమం అంటే దేశంలో ఒక చరిత్ర, ఎందుకంటే ఒక ఉద్యమం జరిగితే 5 ఏళ్ళు,10 ఏళ్ళు వెలుగులో ఉంటాయి . ఆ సమయంలో ఆశయ సాదన అన్న జరిగి ఉండాలి లేక రాజకీయ ,సామజిక ,ఆర్థిక పరిస్తితుల వల్లనో లేక ఆశయ సాదనను మరో విదంగా సాదించటం వలనో ఉద్యమం చల్లారిపోతుంది. కాని ఒక ఉద్యమం మాత్రం ఏళ్లకు ఏళ్లు ఉండటం అంటే చలా కష్టం , కాని భారత దేశ స్వతంత్ర ఉద్యమం మాత్రం 200 ఏళ్లుగా వెలుగులో ఉండి తర తరాలకు బదిలీ అవుతూ గుండెల్లో ఉంటూ చివరికి స్వతంత్రం వచ్చింది. తెలంగాణా ఉద్యమం కూడా అదే కోవలోకి వస్తుంది ఎందుకంటే ఎప్పుడో 60 ఏళ్ల ముందు మొదలైన ఉద్యమం చివరికి కెసిఆర్ మరియు చాలా మంది ఉద్యమకారుల పుణ్యామా అని ఫలం సాకా రం అయ్యింది. ఈ ప్రాసెస్ లో ఏంటో మంది ఆర్థికంగా,మానసికంగా ,సామాజికంగా,బౌతికంగా బలయ్యారు. ఒక 10 ఏళ్ళు రాజకీయ కారణాల వలన కొంచెం టెంపరరీ బ్రేక్ వచ్చినా మలి దశ ఉద్యమంతో తెలంగాణా వచ్చింది ,60 ఏళ్ళు గా ఉద్యమ వేడి మాత్రం తగ్గలేదు.
ఐతే ఇప్పుడు అలంటి ఒక ఉద్యమం వచ్చింది ఇపుడు తెలంగాణా లో కాదులే పక్క రాష్ట్రంలో. కాపులను బిసి ల్లోకి మార్చాలని చాలా రోజులుగా డిమాండ్ ఉంది , పోయిన ఎన్నికల్లో చంద్ర బాబు వాళ్ళ వోట్లల్లో 18% శాతమున్నా కాపుల సపోర్ట్ తీసుకొని రిజర్వేషన్ వాగ్దానం చేసాడు. కాని ఓడ ఎక్కేవరకు ఓడ లింగం దీకిపోయక బోడి లింగం అనే రాజకీయ నాయకుల లాగానే చంద్ర బాబు తన బుద్దిని చూపించాడు, తమ సామాజికవర్గానికి రాజకీయంగా ముప్పుగా భావించే కాపు సామజిక వర్గానికి రిజర్వేషన్ ఇస్తే భవిష్యత్తులో ప్రాబ్లం అవుతుందని వెనక్కి తగ్గాడు. ఈ విషయాన్నీ ఎవరో ఒకరు ప్రస్తావించిన కూడా బాబు దానిని పెద్దగ సీరియస్ గా తీసుకోలేదు ఎందుకంటే తన పార్టీ లో ఉన్న మంత్రులు ,నాయకులూ ఉన్నారు దీమాతో ఒకవేళ పరిస్తితి చేజారితే చూసుకుందామని అనుకున్నాడు కాని ముద్రగడ రూపంలో అయన పప్పులు ఉడకేలా కనిపించటం లేదు. తుని లో బహిరంగా సభ అనౌన్స్ చేయగానే , ఏదో సభ పెట్టుకొని వెళ్ళిపోతారు అనుకున్న బాబుకి గట్టి షాక్ తగిలేల కనిపిస్తుంది. అనాదికరంగా 10 లక్షల మంది తుని వెళ్లినట్లు సమాచారం. కానీ, సభ ముగిస్తూ, పట్టాలపైకి ఉద్యమాన్ని నడిపిస్తున్నట్లు ప్రకటించారు. రోడ్లపైనా, రైలు పట్టాలపైనా ఉద్యమం నడుస్తుంది.. అని ఆయన ప్రకటించేసరికి, జనం రెచ్చిపోయారు. రైల్వే ట్రాకుల మీదకు చేరారు.. రోడ్లపై మోహరించారు. ఓ రైలుని తగలబెట్టేశారు. దీంతో ఆంద్ర లో ఉన్నా కాపుల మనోభావాలు ,ఎమోషన్స్ పీక్స్ లోకి పోయాయి . తెలంగాణా ఉద్యమంలో కెసిఆర్ దీక్షా కి దికినపుడు ఉస్మానియా లో హింసా ఘటనలు కలగటం వలన ఉద్యమానికి ఊపు వచ్చిందనే విషయం జగమేగిరిన సత్యం ,ఇపుడు ఇలాంటి సంఘటన జరగటం వలన ఈ ఉద్యమానికి తెలంగాణా ఉద్యమం లాగ మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముద్రగడ మరో కెసిఆర్ అవుతాడో లేక హర్తిక్ పటేల్ లాగా ఉద్యమాన్ని ఆపెస్తాడో భవిష్యత్తు చెపుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here