ముద్రగడ ఉద్యమం జనసేనకు దెబ్బ కొట్టిందా?

0
160

ఎవరు ఊహించనట్లు ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు చేదు ఫలితాలు ఎదురయ్యాయి. ప్రధానంగా రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న కాపు ఓటు బ్యాంకు వల్ల గోదావరి,వైజాగ్ జిల్లాల్లో మెజారిటీ సీట్లు వస్తాయనుకున్న తరుణంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 సీట్లలో కూడా ఓడిపోవటం తెలుగు రాజకీయాలను ఆశ్యర్యంలోకి తోసేసింది. కాపు ఓట్లు ఎక్కువ ఉండే భీమవరం ,గాజువాక స్థానాల్లో ఓడిపోవటం చాలా మంది ఊహించలేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కి కాపుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది . అయన ఆంటే పడి చచ్చే అభిమానులు ఎక్కువ ఉంటారు అలాంటిది పవన్ కళ్యాణ్ నుంచి కాపులను విడగొట్టే ఆ అదృశ్య శక్తి ఏంటని చాలా మందికి అర్థం కాని ప్రశ్న. కాని లోతుల్లోకి వెలితే ముద్రగడ చేసిన కాపు రిజర్వేషన్ ఉద్యమం పవన్ ని కాపుల నుంచి దూరం చేసిందని ఒక విశ్లేషణ.

వాస్తవానికి ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమం వల్ల కాపుల్లో ఐక్యత వచ్చిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వం ముద్రగడ కుటుంబాన్ని కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టిన విషయం అందరికి తెలిసిందే. దీని వల్ల కాపులు చంద్రబాబు మీద తీవ్రమైన కోపంతో ఉండిపోయారు. రాబోయే ఎన్నికల్లో జనసేన కు ఓటు వేసి తెదేపా ఎలాగైనా తగిన బుద్ది చెప్పాలని అనుకుంటున్న తరుణంలో ఎన్నికలు వచ్చాయి. కాని ఎన్నికల సమయంలో జనసేన -తెదేపా అనధికార పొత్తు ఉందని జగన్ వర్గాలు తీవ్రమైన ప్రచారం చేశారు. దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు జగన్ వ్యతిరేకంగా ఎక్కువ ఉండటం ,చంద్ర బాబు ని తక్కువ విమర్శించటం లాంటివి ఆ ప్రచారానికి ఊతం ఇచ్చింది. ప్రధానంగా కాపు బెల్ట్ జిల్లాల్లో కాపులు కూడా పవన్ కళ్యాణ్ గారిని అనుమానించారు. తమ సామజిక వర్గానికి అన్యాయం చేసిన బాబుతో పవన్ ఎలా కలుస్తాడని,ఈసారి పవన్ కి ఓటు వేస్తె బాబుకు వేసినట్లే అని భావించి జగన్ కి మొగ్గు చూపారు. దీంతో జనసేన కు అనుకూలం అవుతారని అనుకున్న ముద్రగడ ఉద్యమం పరోక్షంగా ప్రతికూలం అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here