లండన్ ని పూలమయం చేసిన ఎంపి క‌విత‌

0
1141

            మనకి లండన్ అంటే అక్కడి భవంతులు,లండన్ బ్రిడ్జ్,ఉద్యానవనాలు ఇలా చెప్పుకుంటూ పొతే అక్కడి అందాల గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు కోహినూర్ వజ్రాన్ని తీసుకుపోయారు. అది అక్కడే ఉంది.కానీ అన్ని ఉన్నా కూడా  మన తెలంగాణ పూల జాతరతో అక్కడ ఉన్న అందాలకు ప్రాణమొచ్చినట్లు అయింది. ఈ  సారి మన కోహినూర్ వజ్రం బతుకమ్మ రూపంలో  లండన్ వెళ్లి పూల వర్షం కురిపించింది. ఈ బతుకమ్మ అట పాటలో బతుకమ్మని చూసి అక్కడి ప్రజలు ఒరిజినల్ కోహినూర్ వజ్రాన్ని మర్చిపోయేవిదంగా ఎంపి కవిత ఆధ్వర్యంలో జరిగిన పూల జాతర లండన్ కి వన్నె తెచ్చారు.

నిజానికి అక్క‌డ ఉంటున్న తెలంగాణ‌వాసులు మాత్ర‌మే బ‌తుక‌మ్మ ఆడుతుండే వారు. దీనికి భిన్నంగా ఈ సారి తెలంగాణ జాగృతి యూకె శాఖ పెద్ద ఎత్తున పండుగ వాతావ‌ర‌ణంలో బ‌తుక‌మ్మ ను నిర్వ‌హిస్తుండ‌టంతో మ‌న దేశంలోని ఇత‌ర రాష్ట్రాల వారు కూడా బ‌తుక‌మ్మ పండుగ‌లో పాలుపంచుకుంటున్నారు. తొమ్మిది  రోజుల పాటు జ‌రిగే బ‌తుక‌మ్మ పండగలో భాగంగా రెండవ రోజు అయిన శ‌నివారం లండ‌న్‌లో ఘ‌నంగా బ‌తుక‌మ్మను నిర్వ‌హించింది. ఈ సంబురాల‌కు తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షురాలు, నిజామాబాద్ ఎంపి శ్రీమ‌తి క‌ల్వ‌కుంట్ల క‌విత ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. నిన్న యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లోని ఆల్ ఉమ్ క్వ‌యిన్‌లో జ‌రిగిన ఎంగిలిపూల బ‌తుక‌మ్మ‌కు హాజ‌ర‌యిన ఆమె ఇవాళ ఉద‌యం యూకెలోని హీత్రూ విమానాశ్ర‌యం చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌విత‌ను యూకె జాగృతి శాఖ ప్ర‌తినిధులు సాద‌రం స్వాగ‌తం ప‌లికారు.

తెలంగాణ జాగృతి యూకె అధ్య‌క్షుడు సంప‌త్ ద‌న్న‌మ‌నేని నివాసంలో క‌ల్వ‌కుంట్ల క‌విత బ‌తుక‌మ్మ‌ల‌ను త‌యారు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో  జాగృతి మ‌హిళా విభాగం స‌భ్యులు పాల్గొన్నారు. అక్క‌డ దొరికే రంగురంగుల పూల‌తో తొమ్మిది వ‌రుసుల్లో బ‌తుక‌మ్మ‌ను గో్పురంగా పేర్చారు క‌విత‌. బాలిక‌ల‌కు బ‌తుమ్మ‌ను త‌యారు చేయ‌డం ఎలాగో చెప్తూ…వారి చేత చిన్న బ‌తుక‌మ్మ‌ల‌ను పేర్చించారు. అనంత‌రం ప‌సుపుతో గౌర‌మ్మ‌ను త‌యారు చేసి…కుంకుమ పెట్టారు. శుభ్రం చేసిన దేవుడి గ‌ది ముందు బ‌తుక‌మ్మ‌ల‌ను పీట‌ల‌పై పెట్టి..అగ‌రువ‌త్తుల‌ను వెలిగించి …గౌరీ దేవికి మొక్కారు క‌విత‌. బ‌తుక‌మ్మ‌ల‌ను త‌యారు చేస్తున్నంత సేపూ క‌విత బ‌తుక‌మ్మ పాట‌ల‌ను పాడారు. చాలా ఏళ్ల నుంచి లండ‌న్‌లో ఉంటుండ‌టం చేత బ‌తుక‌మ్మ పాట‌ల‌ను వారు మ‌ర్చిపో్యారు. దీంతో వారికి పాత పాట‌ల‌తో పాటు కొత్త పాట‌ల‌ను కూడా పాడుతూ వారితో కూడా పాడించారు. క‌విత ఉత్సాహాన్ని చూసిన చుట్టుప‌క్క‌ల నివ‌సించే ఇత‌ర రాష్ట్రాల వారు సైతం ఉత్సాహంగా ఉయ్యాలో…అంటూ గొంతు కల‌ప‌డం విశేషం.
ఈస్ట్ హామ్‌లో సంబురాలు
లండ‌న్  ఈస్ట్ హామ్‌లో బ‌తుక‌మ్మ‌ ఆటా-పాట‌కు వేదిక‌యింది.  బ‌తుక‌మ్మ ఆట‌-ఉయ్యాల పాట‌ల‌త‌తో వైట్ హౌజ్ ప్రాంగ‌ణం కొత్త శోభ‌ను సంత‌రించుకుంది. బ‌తుక‌మ్మ వేడుక‌ల‌కు న్యూహాం, వెస్ట్ హాం, వెస్ట్ లండ‌న్ పార్ల‌మెంటు స‌భ్యులు  స్టీఫెన్ టిమ్స్ ,లిన్ బ్రౌన్‌, రూత్ కాడ్‌బ‌రీ,  లార్డ్ దొల‌కియా, లామ్‌బాత్‌ మేయ‌ర్ స‌లేహా జాఫ‌ర్, ఇండియ‌న్ హై క‌మిష‌న్ కార్య‌ద‌ర్శి విజ‌య్ వ‌సంత్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ జాగృతి యూకె శాఖ అధ్య‌క్షుడు సంప‌త్ ద‌న్న‌మ‌నేని, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్ర‌వ‌ణ్ రెడ్డి, ఉపాధ్య‌క్షుడు సుమ‌న్ బ‌ల్మూరి, సుష్మ జువ్వాడి, సంతోష్ కుమార్‌, పావ‌ని గ‌ణేశ్‌, ప్ర‌శాంత్ పూస‌, ర‌ఘు జ‌క్కుల‌, కిశో్ర్ కుమార్, క‌త్తి పావ‌ని, వంశీ , స‌లామ్‌ యూసుఫ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

mpkavitha-bathukamma-celebrations-in-london-1

mpkavitha-bathukamma-celebrations-in-london-2

mpkavitha-bathukamma-celebrations-in-london-1 mpkavitha-bathukamma-celebrations-in-london-2 mpkavitha-bathukamma-celebrations-in-london-3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here