కబుర్లు కామెంట్స్: ఢిల్లీలో ఎంపీ అయినా తల్లికి కూతురే ….

0
1861

తెలుగులో ఒక సామెత ఉంటుంది ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని .కానీ ఈ చిత్రం చూస్తుంటే అదే సామెత చిన్న మార్పులతో పై విదంగా చెప్పొచ్చు. అసలు విషయానికొస్తే ఢిల్లీలోని పార్లమెంట్ లో నిజామాబాదు ఎంపీ గా ప్రాతినిధ్యం వహిస్తూ ,తెలంగాణ బతుకమ్మ ని ప్రపంచానికి పరిచయం చేసి , మహిళల రాజ్యాధికారం ఎక్కువ ఉండే భారత ఉప ఖండంలో, తెలంగాణలో కూడా మహిళలు రాజకీయాలను శాసించగలరు అని నిరూపించి పురుషలకు కూడా రాజకీయ అసూయా కల్గిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు బతుకమ్మ నవరాత్రుల్లో రోజుకో దేశ ముఖ్య నగరంలో ప్రవాస తెలంగాణ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి సంచలనం సృష్టించింది. ఒక రోజు దుబాయ్ ,మరో రోజు లండన్ ,మరుసటి రోజు అమెరికా ,తర్వాత రోజు హైదరాబాద్ లో , ఆ తర్వాత రోజు నిజామాబాదు నగరంలో దసరా ఉత్సవం ,మరుసటి రోజు ఆస్ట్రేలియా ,తర్వాత రోజు డెన్మార్క్ ,మరుసటి రోజు కువైట్ ఇలా బతుకమ్మ కోసం ప్రపంచ దేశాలు పర్యటించింది. ఇలా కొద్దీ రోజుల్లో ఇన్ని దేశాల్లో బతుకమ్మ సంబరాలకు వెళ్ళినప్పుడు   ఆమెలో మాత్రం అలసట బదులు బతుకమ్మని ప్రపంచ దేశాలకు విస్తరించిన ఉత్సాహం కనిపించింది.

కాని కవిత ఇంటికి చేరగానే వాళ్ళ తల్లి, తెలంగాణ సీఎం కెసిఆర్ సతీమణి శ్రీమతి శోభ మాత్రం తన కూతుర్ని దీవించి తన తల్లి ప్రేమ చూపించింది. ఏది ఏమైనా ప్రపంచంలో తల్లి ప్రేమ ముందు ఎన్ని పదవులైన కరిగిపోవాల్సిందే.                                     

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here