-
అన్న చెల్లెల్లు , అక్క తమ్ముళ్ళ ప్రేమానుబంధాన్నికి ప్రతి రూపమే ఈ “రక్ష బంధన్”. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ముఖ్యోద్ధేశం. అంతేకాకుండా.. జీవితాంతం తమకు రక్షణ కల్పించమని దీని ప్రధానాంశం. ఇంతటి ప్రాముఖ్యతని కలిగిన ఈ పర్వదినాన ఒక సోదరి తన సోదరునికి రాఖీ కట్టి హెల్మెట్ ను బహూకరించి తన ప్రేమను చాటుకుంది. ప్రయాణ సమయంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు తన సోదరునికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని ఆ సోదరి ఇచ్చిన బహూమానం ఇప్పుడు రాష్ట్రం, దేశం మొత్తం ఆ స్పూర్తి బాటలో నడుస్తుందని చెప్పవచ్చు.
-
గత సంవత్సరం నిజమాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ గ్రామానికి చెందిన బాశెట్టి గంగాధర్ కూతురు శ్రీవాణి తన సోదరుడు జగన్ కు రాఖీ కట్టి హెల్మెట్ ను బహూకరించి తన సోదరభావాన్ని చాటుకుంది. అనుకోని సంఘటన మూలంగా తన సోదరునికి ఎలాంటి ప్రమాదం జరగుండ ఉండటానికి తాను హెల్మెట్ ను బహూకరించినట్లు శ్రీవాణి తెలిపింది.
-
ఇప్పుడు శ్రీవాణి స్పూర్తి బాటలోనే యాదృచ్చికంగా జరిగిన విషయం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు , ఎంపి కల్వకుంట్ల కవిత గారు తన సోదరునికి రాఖీ కట్టి హెల్మెట్ ను బహూమతిగా ఇస్తానని చెప్పి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో చాలా ప్రమాదాలల్లో హెల్మేట్ ధరించకపోడం వల్లే అత్యధికంగా ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించడం వల్ల పెను ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అని దానిలో భాగంగా తన సోదరులకి ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించాలి అనే అలోచనను కలిగించడానికి రాఖీ పండగ రోజు హెల్మెట్ ను బహుకరిస్తున్నానని తెలిపింది. ప్రతి సోదరి తన సోదరునికి హెల్మెట్ బహూకరించాలి అనే సంధేశాన్ని కూడ ఇచ్చింది. దానితో కొంత వరకైన ప్రమాదాల నుంచి రక్షించబడుతారని తెలిపింది..
-
Source:Akula Mohan