అంతర్జాతీయ తెలంగాణ క్రికెటర్లను ప్రశంసించిన ఎంపీ కవిత

0
507

ఇప్పటి వరకు తెలంగాణలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులను చూసి ఆనందించటం జరిగింది కానీ తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎంపిక అవ్వటం చూడలేదు.ఎంతో క్రికెట్ ట్యాలెంట్ ఉన్నా కూడా సమైక్య రాష్ట్రంలో తెలంగాణ క్రికెట్ కి దారుణమైన అన్యాయం జరిగిందనేది సత్యం. కానీ ఇపుడు క్రికెట్ అఫ్ తెలంగాణ (క్యాట్) వలన అంతర్జాతీయ స్థాయిలో మన వాళ్ళను చూసుకునే భాగ్యం కల్గింది.

స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా ,SSPF ,క్రికెట్ అఫ్ తెలంగాణ (CAT-క్యాట్) ఆధ్వర్యంలో గ‌త మూడు నెల‌లుగా..క్యాట్ అధ్వ‌ర్యంలో స్కూల్‌స్థాయి క్రికెట్ పోటీల‌ను నిర్వ‌హించారు. వీటిలో స‌త్తాచాటిన విద్యార్థులు జాతీయ స్థాయిలోనూ త‌న ప్ర‌తిభ‌ను క‌న‌ప‌ర్చారు. అంతేకాదు..ప్ర‌క‌టించిన 38ప్రాబ‌బుల్స్‌లో ఇద్ద‌రు తెలంగాణ‌కు చెందిన వారికి అవ‌కాశం ద‌క్కింది. హైద‌రాబాద్‌కు చెందిన శ్ర‌వ‌ణ్‌తో పాటు, ఖ‌మ్మం అంకుర్ అండ‌ర్‌-16 క్రికెట్ జ‌ట్టులో స్థానం ద‌క్కింది. ఇదే జ‌ట్టుకు మేనేజ‌ర్‌గా క్యాట్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ,founder సునీల్ బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

భార‌త్ అండ‌ర్‌-16 జ‌ట్టు ప్రాబ‌బుల్స్‌కు ఎంపికైన ఇద్ద‌రు యంగ్ క్రికెట‌ర్ల‌ను నిజామాబాద్ ఎంపీ క‌విత అభినందించారు. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని, దేశ‌కీర్తితో పాటు రాష్ట్రానికి పేరు తీసుకురావాల‌ని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ ప్ర‌భుత్వం క్రీడ‌ల‌కు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని, స్కూల్ స్థాయి నుంచి ఆట‌ల‌ను ఎంక‌రేజ్ చేస్తామ‌ని ఆమె చెప్పారు. తెలంగాణ క్రికెట్ అసోసియేష‌న్ అధ్వ‌ర్యంలో ఎంపికైన క్రికెట‌ర్ల‌తో పాటు, కోచ్‌లు, సెక్ర‌ట‌రీలు ఎంపీని క‌లిశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here