మోహన్ లాల్ తో సినిమా ఫినిష్ చేయించటం జనతాకి ప్లసా అవుతుందా?

0
5248

గత వారం విడుదల అయిన జనతా గ్యారేజ్ సినిమా మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చిన కూడా మెల్లిగా పుంజుకొని ఎన్టీఆర్ కెరీర్ లో పెద్ద సినిమాగా అవతరించింది. నిజానికి చెప్పాలంటే ఎన్టీఆర్ కి యమదొంగ సినిమా తరవాత ఆ స్థాయిలో కలెక్షన్ వచ్చిన సినిమా అని చెప్పొచ్చు . ఎన్నో అంచనాల మధ్యన విడుదల అయినా ఈ సినిమా ఆ కంటెంట్ చూసిన ప్రేక్షకులు పెదవి విరిచారు. అసలు సినిమా టీజర్లో అందరిని ఆకట్టుకున్న ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ మొదటి భాగానికే పరిమితం అవ్వటం,భారతీయుడు సినిమాను తెలుగు వెర్షన్ లో చూసినట్లు ఉందని ప్రేక్షకులు అనుకున్నారు (భారతీయుడు లో పెద్ద కమల్ హీరో అయినా తన కొడుకుని చంపుతాడు ,ఇక్కడ మోహన్ లాల్ తన హీరో కాని తన స్వంత కొడుకుని చంపటం ,ఒకవేళ ఎన్టీఆర్ పాత్రని చంపి ఉంటె అది తమిళ్ సినిమా అయ్యేదని ఆడియన్స్ అంటున్నారు అనుకోండి అది వేరే విషయం ).

ఐతే సినిమా కంటెంట్ శ్రీమంతుడు,మిర్చి లతో పోల్చితే ఆ స్థాయిలో లేదు కానీ కలెక్టన్స్ మాత్రం భీకరంగా ఉన్నాయి. నిజానికి ఈ మధ్య ఎన్టీఆర్ సినిమాలు కంటెంట్ పరంగా సూపర్ గా ఉన్న టెంపర్,నాన్నకు ప్రేమతో సినిమాలు కూడా భీభత్సమైన కలెక్షన్ రాలేవు. కానీ జనతా విషయంలో రివర్స్ లో ఉంది. ఐతే విశ్లేషకులు మాత్రం కింది విషయాలు జనతా సూపర్ సక్సెస్ కి కారణమయ్యాయి అంటున్నారు.

1) సినిమాను గురువారం విడుదల చేసి శుక్ర,శని ,అది ,సోమవారాలను బాగా ఉపయోగించుకుంది జనతా గ్యారేజీ .దానికి తోడు థియేటర్లలో పెద్ద సినిమా లేకపోవటం కలిసివచ్చింది.
2) ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ మోహ లాల్, ప్రపంచవ్యాప్తంగా కమల్ హాసన్ తర్వాత అంతటి గొప్ప ఇండియన్ నటుడు అని పేరుంది. తన లైఫ్ లో మొదటిసారిగా ఒక ఫుల్ లెంగ్త్ తెలుగు సినిమాలో నటించటం ఇదే మొదటిసారి (మనమంతా ముందే విడుదల అయింది ),దీనితో వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఈ సినిమా చూడాలని అనుకున్నారు,ప్రధానంగా కేరళలో మంచి కలెక్షన్ రాబట్టింది. ఇప్పటి వరకు తారక్ కి అక్కడ మార్కెట్ లేదు కానీ ఈ సినిమాకు గ్లోబల్ రెకాగ్నిజషన్ వచ్చింది.
3) ఐతే సినిమాకి కూడా మోహన్లాల్ ఒక హీరో అన్నట్టు సినిమా బృందం మార్కెటింగ్ చేసింది. దానికి తోడు కేరళ పోస్టర్ లలో కేవలం మోహన్ లాల్ పోస్టర్లు దర్శనిమిచ్చాయి. పబ్లిసిటీ లోనే కాకుండా సినిమాలో కూడా మోహన్లాల్ కొడుకు పాత్రధారిని ఎన్టీఆర్ తో చంపించటం కాకుండా మోహన్ లాల్ తో చంపించటం ద్వారా ఈ సినిమాకు మోహన్ లాల్ కూడా ఓకే హీరో అని ఒక సందేశము ఇచ్చారు.
4) సినిమాకు మరో ప్లస్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం,తీరు ఫోటోగ్రఫి ,కాజల్ ఐటెం సాంగ్.

ఏది ఏమైనా తారక్ లాంటి భారీ ఇమేజ్ ఉన్న నటుడు ఇలా మల్టీ స్టార్ సినిమాకు ఒప్పుకోవటం దానికి తగ్గట్టుగా నటించటం విశేషమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here