కరోన సంక్షోభంలో దేశంలో ఎంతో మంది యువకులు, సామాజిక సంస్థలు,సామాజిక వేత్తలు ఎన్నో సేవలు చేశారు.నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలో పెంటకలన్ గ్రామవాసి ,మనం ఫౌండేషన్ ఫౌండర్ అయిన ఆర్ ఎస్ కుమార్ చేసిన సేవలకు ఢిల్లీ లోని మోడీ వారియర్ సంస్ధ ఫౌండర్ సాధు సాహెబ్ ప్రశంసిస్తూ గౌరవ పత్రాన్ని అందజేశారు. ఈ గౌరవాన్ని అందుకున్న కుమార్ మాట్లాడుతూ నేను గతంలో మనం ఫౌండషన్ నుంచి అనాధ ఆశ్రమలకు చేసిన సేవలకు,కరోన సమయంలో చేసిన కార్యక్రమాలకు ఈ గౌరవం అందిందని,ఈ గౌరవంతో నాకు మరింత సామాజిక బాధ్యత పెరిగిందని తెలియజేశారు.