భాజపాకి అచ్చిరాని 13ని బాబుకి పడేశారా ?

0
627

నంబర్ 13…. ఈ పేరు అంకె చెవిలో వినపడితే ప్రపంచాన్ని మ్యూట్ లో పెట్టేస్తారు ప్రజలు. అమెరికా లో అయితే దినసరి పనుల్లో 13 సంఖ్యను పూర్తిగా అవాయిడ్ చేస్తారు. లిఫ్ట్ లో 12 తర్వాత 14 ఉంటుంది .హాస్పిటల్ లో రూం నంబర్ 13 ఉండదు. ఇంటి నంబర్ 13 అని ఒక సినిమా కూడా వచ్చింది. మన ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ లాంటి వాళ్లకు కొంత మందికే 13 లక్కీ నంబర్ ఈ ఉండొచ్చు కానీ దాదాపు ప్రతి ఒకరికి ఆ అంకె అంటే దురదృష్ట సంఖ్య గానే మిగిలిపోయింది.

ఇక భాజపా పార్టీ వాళ్ళుకు అయితే 13 అంకె ప్రభావం చాలా గట్టిగానే ఉంది. 1996 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద పార్టీ గా అవతరించిన బాజాపా వాజపేయి నేతృత్వంలో చరిత్రలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చింది. తన మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేసిన ఆయన పార్లమెంట్ లో బలం నిరూపించుకునే సమయానికి మిగతా పార్టీల సహాయ నిరాకరణ వలన 13 రోజులకే ప్రభుత్వం కుప్పకూలిపోయింది. మళ్ళీ 1998 లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో జయలలిత సహాయంతో అధికారంలోకి వచ్చిన భాజపా మళ్ళీ 13 నెలలకే కూలిపోయింది. అక్కడి నుంచి 13 సంఖ్య చూస్తే చాలు భాజపా ఆమడ దూరం వెళ్తుంది.

అయితే ఇన్ని రోజులకు 13 సంఖ్య ని భాజపా మరో విదంగా ఉపయోగించుకుంది. అసలు విషయానికొస్తే ఇటీవల ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ర్యాంకులను కేటాయించాడు. దానిలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కి 1 ర్యాంక్ నిస్తే మరో తెలుగు చంద్ర బాబు కి మాత్రం భాజపా దురదృష్ట సంఖ్య 13 ని కేటాయించాడు. ఇది యాదృచికంగానే జరిగినా కూడా కొందరు మాత్రం డిటెక్టీవ్ లాగా పరిశోధనలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో బాబు ని 2019 కి ప్రధానిగా ఆయన సన్నిహితులు ఢిల్లీలో ప్రమోట్ చేస్తున్నారని మోడీకి ఎవరో చెవిలో ఊదరట ,దానితో ఎలాగైనా బాబు కి చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో మోడీ అలా చేసారని అంటున్నారు.ఇది ఏమైనా అసలు లోగుట్టు పెరుమాళ్ళకే తెలియాలి.

source:అశ్విన్ పోతుల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here