పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

0
568
modi and trump strong warning to pakistan
modi and trump strong warning to pakistan
    నీ గ‌డ్డ మీద ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌ను ఆపెయ్‌ లేదంటే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని ప్రధాని న‌రేంద్ర మోదీ, అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కంబైన్డ్‌గా పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా పాకిస్థాన్ పౌరుడు, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ స‌య్యద్ స‌లాహుద్దీన్‌ను అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా అమెరికా గుర్తించింది. ఈ స‌లాహుద్దీనే 27 ఏళ్లుగా పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్‌లో ఉగ్ర‌వాదుల‌కు శిక్ష‌ణ ఇచ్చి ఇండియాపై దాడుల‌కు ఉసిగొల్పుతున్నాడు. స‌రిహ‌ద్దు నుంచి ఉగ్ర‌వాదుల అక్ర‌మ చొర‌బాట్ల‌పై చ‌ర్య తీసుకోవాల్సిందేనన‌ని పాకిస్థాన్‌కు మ‌రోసారి స్ప‌ష్టంచేశారు.

    మోదీ ప‌క్క‌నుండ‌గా ట్రంప్ పాకిస్థాన్‌కు పంపించిన స్ట్రాంగ్ వార్నింగ్ ఇదేనని భార‌త విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి జైశంక‌ర్ అన్నారు. రెండు దేశాల మ‌ధ్య భ‌ద్ర‌త భాగ‌స్వామ్యం మ‌రింత మెరుగ‌వ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని,రెండు దేశాలు ఉగ్ర‌వాద బాధిత దేశాలేన‌ని ట్రంప్ అన్నారు. ఉగ్ర‌వాద సంస్థ‌ల‌ను, ఇస్లామిక్ ఉగ్ర‌వాదాన్ని అంతం చేయాలని తామిద్ద‌రం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు , వీటికి చెక్ పెట్ట‌డానికి ఇద్ద‌రం క‌లిసి పనిచేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు మోదీ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here