ఎమ్మెల్సీ ఎన్నికలపై.. నిష్పక్షపాత విశ్లేషణ.. -సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీందర్

127 0

ఎమ్మెల్సీ ఎన్నికలపై.. నిష్పక్షపాత విశ్లేషణ..
-సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీందర్..
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

అధికార పార్టీ కి ప్రతిష్టగా మారిన ఎం.ఎల్.సి ఎన్నికలు

మార్చి 14 న ఎన్నికలు .ఈ ఎన్నికలు ఒక రకంగా అధికార పార్టీకి రెఫరెండం లాంటివి.ఎందుకంటే 6 ఉమ్మడి జిల్లాలు అంటే సగం కన్నా ఎక్కువ తెలంగాణ జనుల తీర్పు ఇది.అందులోనూ పట్టభద్రులు ఇచ్చే తీర్పు.అందుకే విజయం కోసం టి.ఆర్.ఎస్ సర్వ శక్తులొడ్డి పోరాడుతున్నది, రాష్ట్రంలో చెదురుతున్న ప్రతిష్టను కాపాడుకోవాలని చూస్తున్నది.రాష్ట్రాల్లో అధికారం కోసం ఏదయినా చేయడానికి సాహసిస్తున్నా బి.జె.పి అంతే దన్నుగా ప్రచారం చేస్తున్నది.మద్యలో ప్రొఫెసర్లు కోదండ రామ్ రెడ్డి ,నాగేశ్వర్ లు మేము గెలుస్తున్నామని అంటున్నారు.
హైదరబాద్, మహబూబ్ నగర్,రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నుండి 93 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. మొత్తం 5.3 లక్షల మంది వోటర్లున్నారు. బిజెపి అభ్యర్థి గా రామ్ చందర్ రావ్ సిట్టింగ్ ఎం‌ఎల్‌సి మళ్ళీ బరిలోకి దిగారు.”ఆరేళ్లలో ప్రజా సమస్యలపై పోరాడా, మళ్లీ గెలుపొంది సమస్యలపై ప్రశ్నించే గొంతునవుతా. ప్రజల్లోని ప్రభుత్వ వ్యతిరేకతే ఉంది.నిరుద్యోగులు ,ఉద్యోగులు నాకు అండ నేను మళ్ళీ గెలుస్తున్నాను” అని అంటున్నారు. వ్యక్తిగత పరపతి పార్టీ నిర్మాణం,వ్యూహాత్మక ఎత్తుగడలు వీరిని ప్రదాన అబ్యర్థిగా నిలిపాయి.
నాగేశ్వర్ గతంలో సి‌పి‌ఎం అబ్యర్థిగా రెండు సార్లు గెలిచారు, వ్యూహాత్మకంగా మూడో సారి ఇండిపెండెంట్ గా బరిలో దిగారు. వీరు ఏనాడూ ఏ ఒక్క సమస్య పై విజయం సాదించే దాకా పట్టు బట్టి పోరాటం చేయ లేదు.తెలంగాణ ఉద్యమంలో చివరిదాకా గోడ మీద కూర్చున్నారు. ఏనాడూ ఎవరికి రూపాయి ఛారిటీ చేయ లేదు. ఇటీవల టి‌ఆర్‌ఎస్ తో అండర్ స్టాండింగ్ ఏర్పర్చుకున్నన్నట్లు రూమర్స్ ఉన్నాయి, ఆదాయం కోసం యూ ట్యూబ్ లో విశ్లేషణలు చేసే వీరు గత ఏడాదిలో అధికార పార్టీ మీద ఒక్కాసారి కూడా విమర్శనాత్మకంగా మాట్లాడలేదని కూడా విమర్శ ఉంది.అవినీతి ఆరోపణలు లేవు గాని డబ్బు యావ ఉన్నట్లు, సన్నిహితులు చెబుతారు.మూడు జిల్లాలలోని కోమట్ల పూర్తి సహాకారం వీరికి లభించే అవకాశం ఉంది.బయటి రాష్ట్రాల కోమట్లు ఆర్థికంగా సహకరించే వీలు ఉంది. వామ పక్ష పార్టీలఅవకాశ వాదం వీరిని ఓడించే అంశం కావచ్చు. టి.ఆర్.ఎస్ పట్ల అనుకూలంగా ఉండడం ప్రతికూలంగా మారనుంది.
మాజీ మంత్రి చిన్నా రెడ్డి కాంగ్రెస్ అబ్యర్థి, అన్నీ అవకాశాలు ఉండి కూడా వీరు రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదగ లేక పోయారు .గుడ్ విల్ కూడా అంత బాగా లేదు. రెడ్డి కుల అబ్యర్థి, అయినా కులం వీరికి పెద్దగా ఉపకరించక పోవచ్చు.మొన్నఎం.ఎల్.సి గా గెలిచిన జీవన్ రెడ్డికున్నంత గుడ్ విల్ వీరికి లేదు. కుటుంబ గొడవలను మీడియా కెక్కించుకున్న వైనం వీరి ప్రతిష్టను మసక బరిచింది. అన్నీ పార్టీల రెడ్లు,హార్డ్ కోర్ కాంగ్రెస్ వారి వోట్లు వీరికి పడతాయి.అయినా వీరు గెలుపుకు దగ్గరయ్యే అవకాశం తక్కువగా ఉంది.రెండవ స్థానం కోసం పోటీ పడాల్సిన పరిస్తితి వీరిది.” ఎంఎల్‌ఎగా, మంత్రిగా పలుసార్లు ప్రజాసేవ చేసిన అనుభవం ఉంది. నిరుద్యోగ సమస్యపై మండలిలో గొంతెత్తుతాను “, ఉద్యోగాలు ఇవ్వడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి అని వీరు ప్రచారం చేస్తున్నారు.
తెలుగు దేశం పార్టీ అబ్యర్థి ఎల్.రమణ పార్టీ వోట్లు, బీసీ వొట్ల పై నమ్మకం పెట్టుకున్నారు.బీసీ లల్లో ఐక్యత లేదు,తెలుగు దేశం వోట్లు చెదిరి పోయి,చాలా వరకు టి.ఆర్.ఎస్.వోట్లుగా మారి పోయాయి.వీరు ప్రధాన అబ్యర్థిగా ఉండక పోవచ్చు.
ఎం.ఐ ఎం. అబ్యర్థి ముస్లీంల వొట్ల పై నమ్మకం పెట్టుకున్నారు.వీరు వొట్లను చీల్చ డానికి వీరి వోట్లు టి.ఆర్.ఎస్.కు పడకుండా జాతీయ పార్టీ అబ్యర్తిని గెలిపించడానికే నిలిచారని విశ్లేషణలు వినిపించాయి.
“మా నాయన పివి ఆశీస్సులు…సిఎం ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చానని “ సురబి వాణి దేవి అంటున్నారు.. మూడు జిల్లాల్లోని మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, పార్టీశ్రేణులంతా ఆమె విజయం కోసం పనిచేస్తున్నారట..
1952 లో పుట్టిన వీరు 69 వ ఏట రాజకీయాలలోకి వచ్చారు.ఐదేళ్లు లెక్చరర్ గా పని చేసి తర్వాత పలు విద్యా సంస్థలను స్టాపించారు.సురబి వారి ఇంటి కోడలు అయినా పీ.వి కూతురిగానే గుర్తింపును నోచుకున్నారు.ఒక్క రోజు అయినా తెలంగాణ ఉద్యమం లో పాల్గొన లేదు.ఒక సారి అయినా నోరారా “ జై తెలంగాణ” అనలేదు. గత ఎన్నికలలో ఓటమి చెందిన టి.ఆర్.ఎస్. అభ్యర్థి దేవి ప్రసాద్ కన్న మెరుగయిన క్యాండిడేట్ ఏమీ కాదు.ఆయనే ఓడి పోయాడు. వాణికి బి ఫారం ఇవ్వడం ఏమో కానీ పి‌వి బొమ్మను బాజాప్తాగా గులాభి బ్యానర్ల పై వేసు కున్నారు.

అటు ఇటుగా 50 % వోట్లు పోల్ అవుతాయి.పరిస్తితి పోటా పోటీగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ పోలింగ్ కూడా జరగ వచ్చు.ఈ నియోజక వర్గ లో బిజెపి అబ్యర్థి పరిస్తితి కొంత మెరుగ్గా ఉందని కొన్ని అనదికారా సర్వేలు వెల్లడించాయి.
………….
నల్గొండ,ఖమ్మం,వరంగల్ ఎం.ఎల్.సి స్థానానికి 71 మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు.ఇక్కడ 5.05 లక్షల మంది వోటర్లున్నారు.వీరిలో లక్ష పైగా లంబాడీల వోట్లు ఉన్నాయి.ఆ వొట్లు, ,కాంగ్రెస్ వొట్లతో సునాయాసంగా బయట పడతాని ఆ పార్టీ అభ్యర్థి రాములు నాయక్ అంటున్నారు.
టి.ఆర్.ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎం.ఎల్.సి పల్లా రాజేశ్వర్ రెడ్డి , బిజెపి నుంచి ప్రేమేందర్ రెడ్డి, తెలంగాణ జన సమితి అబ్యర్థిగా కోదండ రామ్ రెడ్డి , తెలంగాణ ఇంటి పార్టీ నుండి చెరకు సుధాకర్ ,కాంగ్రెస్ పార్టీ నుండి రాములు నాయక్, మాజీ మీడియా పర్సన్ రాణి రుద్రమ రెడ్డి, తీన్మార్ మల్లన్న,విజయ సారథి రెడ్డి,(వామ పక్షాల ఉమ్మడి అబ్యర్తి) ఇలా డెబ్బయి మంది పైగా రంగంలో ఉన్నారు.
రైతు సమన్వయ సమితి అద్యక్షులుగా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న ఎం.ఎల్.సి పల్లా రాజేశ్వర్ రెడ్డి ,ఈ సారి గెలిచే అవకాశాలు తక్కువే కాబట్టి మొదట పోటీ చేయకూడదు అనిఊ అనుకున్నారట,కానీ పార్టీ నిర్ణయం మేరకు పోటీకి దిగాల్సి వచ్చింది అన్నది వార్తల సారాంశం. గత ఎన్నికలలో కష్టంగా 3 వ రౌండ్ లో గెలిచాడు.భార్య కమ్మ కులస్థురాలు ఈ అంశం కొంత వీరికి అనుకూలించ వచ్చు. .ప్రగతి భవన్లోకి మల్టీఫుల్ ఎంట్రీ వీసా అనుమతి ఉన్నందున తరచుగా అక్కడికి వెళ్ళి పలువురు జిల్లా నాయకుల పై చాడీలు చెప్పాడని, అందుకే ఎం.ఎల్.ఏ లండరు ఈయన గేలా నివ్వరని వారంతా గుర్రుగా ఉన్నారని కొన్ని వార్తలు వచ్చాయి. గత ఎం.పి.ఎన్నికలలో కవిత కు ఎదురైన పరిస్తితి వీరికి ఎదురౌతుందని జిల్లా విలేకరుల ఉవాచ.పలు నియోజక వర్గాల్లో ఏజంట్ లను పెట్టుకుని శాసన సభ్యులను కాదని పలు వ్యాపార,పైరవీ కార్యాలు నిర్వహించాడననే రూమర్ కూడా ఉంది.
సర్పంచ్ లు ,ఎం‌పి‌టి‌సి,జడ్ .పి.టీ,సి.ఇతర నాయకుల ద్వారా వోటర్ల బ్యాంక్ అకౌంట్ నబర్లు,పోన్ నంభర్లు తెప్పించుకుని డబ్బులను నేరుగా వోటర్ల అకౌంట్ లలో వేస్తున్నారని ,50 వేల పైగా కొత్త వోటర్లను అధికార అండతో అక్రమంగా నమోదు చేయించుకున్నాడని ,50 కోట్ల పైగా ఖర్చుకు సిద్దపడి ఎలాగయినా గెలవాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సోషల్ మీడియా లో పోస్టింగులు వచ్చాయి. గతంలో రెండో స్తానంలో వచ్చిన బి.జె.పి కూడా ఈ సారి ఎలాగయినా గెలవాలని చాప కింద నీరులా గట్టి ప్రయత్నమే చేస్తున్నది.25 మంది వోటర్లకు ఒక పార్టీ నాయకుడిని కేటాయించి ఆ వొట్ల భాధ్యతను ఆయనకు అప్పగించినట్లు ,ఏది ఏమయినా రాష్ట్రంలో రెండు ఎం.ఎల్.సి సీట్లు గెలుచుకుని సత్తా చాటుతామని బిజెపి వారు అంటున్నారు.
ఉద్యోగులు,నిరుద్యోగులు, ఉపాద్యాయులు,ఉద్యమకారుల మొదటి వోటుతో పాటు , సెకండ్ ప్రిఫరెన్షియల్ వొట్ల బలంతో కోదండ రామ్ రెడ్డి గెలవొచ్చు అన్నది ఇంకో రకం విశ్లేషణ . “మేము సులువుగా గెలుస్తున్నాము మెజారిటీ పెంచుకోవడానికి ప్రచారం చేస్తున్నామని, గెలుపు మా లక్ష్య కాదు , గౌరవ ప్రదమయిన గెలుపు కావాలి” అని తెలంగాణా జన సమితి నేతలు అంటున్నారు.
కానీ కోదండ రామ్ కు పూర్వం ఉన్న మంచి పేరు లేదు పార్టీలో ఉన్న బీసీ నాయకులందరిని ఆయన దూరం చేసుకున్నారు. ఆయనకు బీసీ వోట్లు పడక పోవచ్చు.అయితే పల్లా మీద ఉన్న వ్యతిరేకత వీరిని గెలిపించ వచ్చు నని అనుకోవచ్చు,రెడ్ల వోట్లు గంప గుత్తగా కోదండ రామ్ రెడ్డికి పడతాయన్నపరిస్థితి కూడా లేదు.ఎందుకంటే రాణి రుద్రమతో సహా పలువురు రెడ్డి అబ్యర్థు లున్నారు.అందుకే కోదండ రామ్ రెడ్డి గెలవడం అంతా సులువు ఏమీ కాదని ప్రత్యర్థుల వర్గాలు అంటున్నాయి. ఈ ఎన్నికల్లో వొట్లను చీల్చడానికి టి.ఆర్.ఎస్.అనుకూలూరు కొందరు నిలబడ్డారని ,డబ్బుల పంపిణీ పకడ్భందిగా జరిపే అవకాశం ఉన్నందున పల్లా గెలిచే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.
…………………..

Related Post

ఎమ్మెల్యే వివేక్ పుట్టిన రోజు సందర్భంగా వికలాంగులకు ట్రై సైకిళ్లు అందజేత

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్  పుట్టినరోజు సందర్భంగా వేడుకలకు బదులుగా పేదలకు సేవా కార్యక్రమాలు చేయాలనే పిలుపుతో ఈరోజు 129 సూరారం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు…

సావేల్ లో అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో మహిళా రైతుకు సన్మానం

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సావేల్ గ్రామంలో మహిళా రైతు నెల్ల లక్ష్మీ ( సావేల్ సొసైటీ డైరెక్టర్)…

ఆకుల కొండూరు గ్రామంలో ఆగ్రోస్ సీడ్స్ వారి రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ నిజామాబాద్ జిల్లా పరిషత్ ఆర్థిక మరియు ప్రణాళిక, ధర్పల్లి జెడ్పిటిసి సభ్యులు శ్రీ బాజిరెడ్డి జగన్ మోహన్ గారు

నిజామాబాద్ మండల కేంద్రంలోని ఆకుల కొండూరు గ్రామంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ వారికి…

మెక్సికోలో తొలి తెలంగాణ సంఘానికి బీజం వేసిన రాజశేఖర్ ర్యాడకు జన్మదిన శుభాకాంక్షలు

చీమలు దూరని చిట్టడివిలోకి అడుగుపెట్టి జనజీవన స్రవంతి గా మార్చటం ఎంత కష్టమో మెక్సికో లాంటి దేశంలో తెలుగు వాళ్లకు ఒక సంఘం పెట్టడం అంత కష్టం.…

భారీ వర్షాల బాధిత కుటుంభానికి సహాయం చేసిన ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ

ఇల్లందు మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామపంచాయతీ లోని హాస్టల్ రోoపేడు లో ప్రాంతంలో  పిచ్చయ్య విజయ కుమారి గారి గ్రామస్తులు వేసిన తాత్కాలిక ఇల్లు భారీ వర్షాల…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *