అమెరికాపై మైక్రోసాఫ్ట్ సంచలన వాక్యలు

0
542
Microsoft fire on America
Microsoft fire on America
    ప్రచంచవ్యాప్తంగా కొన్ని లక్షల కంప్యూటర్ లు పని చేయకుండా చేసిన సైబర్ దాడికి కారణం అమెరికానే అని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మండిపడుతోంది. ప్రపంచ దేశాలన్నింటిని గడగడలాడించిన వన్నా క్రై అనే వైరస్ వల్ల మోటారు సంస్థలు, ఆసుపత్రులు, స్కూల్స్, షాపులు ఇలా ప్రతి ఒక్క సంస్థ హడలెత్తిపోతున్నాయి. రాన్సమ్ వేర్ వైరస్ అటాక్ చేసిన హ్యాకింగ్ టూల్, అమెరికా కేంద్ర నిఘా సంస్థ రూపొందించిందని మైక్రోసాఫ్ట్ అధినేత బ్రాడ్ స్మిత్ తన బ్లాక్ పోస్టులో పేర్కొన్నారు. దీనిని ఏప్రిల్ లోనే ఆన్ లైన్ లీక్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ వైరస్ మరో సారి దాడి చేయొచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
    వికిలీక్స్ కథనం ప్రకారం అమెరికా కేంద్ర నిఘా సంస్థ వేలకొద్ది హ్యాకింగ్ టూల్స్ ను అభివృద్ధి చేసిందని, వాటితో ప్రతి ఒక్కరిపైనా నిఘా ఉంచుతుందని తెలిపారు. ప్రస్తుతం జరిగిన దాడితో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కస్టమర్లు బలైపోయారని , ఈ దాడితోనైనా అమెరికా ప్రభుత్వం మేల్కోని, ప్రజలకు జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, వైట్ హౌజ్ వర్గాలు ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ చేసిన కామెంట్లపై స్పందించలేదు. సైబర్ దాడికి గురైన చాలా కంప్యూటర్స్ బ్యాకప్స్ తో రికవరీ పొందుతున్నాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here