చిన్న జీయ్యర్ – మాజీ మేయర్ ల ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరం

0
751
mega health camp in nizamabad
mega health camp in nizamabad
    నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 25 వ తేదీన శ్రీమత్ పరమహంస పరివ్రాజక చార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారయణ రామానుజ జీయ్యర్ స్వామి వారి దివ్య మంగళ ఆసీస్సులతో నిజామాబాద్ తొలి మేయర్ శ్రీ ధర్మపురి సంజయ్ గారు మరియు ఐ.యం.ఎ నిజమాబాద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిభిరాన్ని నిర్వహించనున్నారు.
    ఈ కార్యక్రమాన్ని పట్టణంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో 25-06-2017 ఆదివారం రోజున ఉదయం 9:00 గంటల నుండి మధ్యహ్నం 1:00 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు, ఈ సదావకాశాన్ని నిజమాబాద్ మరియు పరిసర ప్రాంత ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కమిటీ సభ్యులు తెలియజేసారు.

    ఈ వైద్య శిభిరంలో అనేక రకాల వ్యాధులకు వివిధ వైద్య విభాగాల నిపుణులచే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని , కేర్ హాస్పిటల్, మరియు గ్లోబల్ హాస్పిటల్ వారిచే గుండె సంబంధ వ్యాధులకు చికిత్స లు నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు. అలాగే ఈ కార్యక్రమంలో వివిధ రకాల వ్యాధులకు పట్టణ ప్రముఖ వైద్య నిపుణులచే పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా ఇస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here