తారక్ పుష్కరాల ప్రసంగం వెనుక ఆంతర్యం?

0
1421

జనతా గారేజ్ ఆడియో లాంచ్ కన్నుల పండగ జరిగింది. అందులోనా పాటలు చాల బాగున్నాయి. టీజర్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు . మొక్కలను రక్షించటం ఎంత ముఖ్యమో మనుషులను కాపాడుకోవటం అంతే ముఖ్యం అనే థీమ్ సినిమా బంపర్ హిట్ అనే టాక్ వచ్చింది. తారక్ ప్రసంగం ఆద్యంతం బాగుంది. ముక్యంగా అభిమానుల గురుంచి అయన మాట్లాడిన విధానం బాగుంది.

అంతా బాగుంది కానీ అయన ప్రసంగం మొత్తం పుష్కరాల గురుంచి చాల సార్లు మాట్లాడాడు. 12 ఏళ్ల కాలంలో తనకు వచ్చిన హిట్లు ఫ్లాఫ్ల గురుంచి ఒకసారి ,తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నా కృష్ణ పుష్కరాల గురుంచి మాట్లాడుతూ అందరు జాగ్రత్తగా పుష్కర స్నానము చేయాలనీ ,ఒక తెలుగు వాడిగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు తెలుగుతనం చూపించాలని ఆయన సూచించాడు. ఐతే విశ్లేషకులు మాత్రం ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్ర బాబు నుంచి పుష్కరాలకు ఆహ్వానం అందిందని ,మల్లి తారక్ అన్ని మర్చిపోయి 2009 ఎన్నికల సమయంలో చంద్రబాబుకి సపోర్ట్ చేసినట్లు ఇప్పుడు కూడా చేస్తున్నాడని ఒక వినికిడి. అందుకే పుష్కరాల గురుంచి ఆలా పదే పదే మాట్లాడని గుసగుసలాడుతున్నారు. ఐతే కొసమెరుపు ఏంటంటే చంద్ర బాబు రాజకీయ మిత్రుడు పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం అందలేదని సమాచారం. ఏది ఏమైనా లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక అన్నట్టు ఆంధ్ర రాజకీయాలు అక్కడి పెరుమాళ్ళకే తెలుసు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here