జడ్పీటిసి బరిలోకి విద్యావంతుడు

0
232

ఈ రోజుల్లో రాజకీయాలకు చదువుకునేవాళ్ళు దూరం అవుతున్నారు. ఈ పరిణామం వల్ల రాజకీయాల్లోకి డబ్బు సంపాదించాలని అనుకునే వాళ్లు,స్వార్థపూరితమైన ఆశయాలతో రంగంలోకి దిగుతున్నారు. దీని వల్ల ప్రశ్నించే నాయకుడు కరువవుతున్నారు. కాని జగిత్యాల జిల్లాలో ఒక విద్యావంతుడు జడ్పీటిసి బరిలోకిదిగుతున్నాడు.
సుభాష్ వేముల అనే వ్యక్తి బీర్సాని గ్రామం, బుగ్గారం మండలం, జగిత్యాల జిల్లాకి చెందిన వాడు. బుగ్గారం మండలం నుండి జడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. మనకు తెలుసు మనం రోజు ఎన్ని సమస్యలతో సతమతమౌతున్నామో, ప్రతి దినం ఒక కొత్త సమస్య. ఇతను బి.యస్.సి. కంప్యూటర్స్ ఎంబీఏ చదివినప్పటికీ బుగ్గారం మండల ప్రాంతం మీద అభిమానంతో బుగ్గారం మండలం ప్రజలకి సేవ చేయడానికి పోటీ చేస్తున్నారు. ఇతను ప్రజల ముందుకు సాధారణ అభ్యర్థిగా రావడం లేదు. ఇతను చదువుకున్న చదువు, విజ్ఞానం, ఇతరులకు సేవ చేయడానికి అని గ్రహించి, ప్రజల ముందుకు వస్తున్నారు. ప్రతి గ్రామంలో ప్రతి చోట సమస్యలే, ఇతరుల లాగా కాకుండా, ఒక బాధ్యత కలిగిన పౌరుడి లాగా ప్రజల కోసం శ్రమించడానికి మీ ముందుకొస్తున్నారు. చదువుకున్న చదువుతో ప్రతి ఒక్క సమస్యను సమర్థవంతంగా పరిష్కరించగలను అని అనుకోని, మే 6 న జరుగు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. న దేశం మీద ప్రేమ గల వాడిగా, ఇతరుల కోసం, స్వ లాభం కోసం కాకుండా, ప్రజలకి సేవ చేస్తాను అని, అలాగే నాకు అవకాశం ఇచ్చిన, దాన్ని దుర్వినియోగం చేయకుండా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, ప్రతి సమస్యను న సొంత సమస్యల తీసుకొని, ఒక ఇంటి సభ్యుడిగా, అన్నగా, తమ్ముడిగా, స్నేహ భావంతో మీతోనే ఉంటూ, నా భాధ్యతను నిర్వహిస్తానని, మీకు సవినయంగా మనవి చేసుకుంటానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here