జనసేన బీఎస్పీ పొత్తులో ఆజ్ఞతవాసి ఎవరు?

0
177

5 ఏళ్ల క్రీతం ఏర్పాటు అయిన జనసేన పార్టీ వేగాన్ని చూసి చాలా మంది విశ్లేషకులు విమర్శించారు.తాబేలు లా మెల్లిగా వ్యవహారాలు ఉండటం,జగన్ ప్రచారంలో దూసుకుపోవటం చూసి జనసేన మీద అంచనాలు తగ్గిపోయాయి.అయితె ఇదే విషయం పార్టీ వర్గాలను ఆడిగినపుడు నెల రోజుల్లో దూసుకుపోయే సంచలన వ్యూహాలు మా దగ్గర ఉన్నాయని చెబుతూ వస్తున్నారు. అయితె గత 2 రోజులుగా పార్టీ నుంచి వచ్చిన 2 నిర్ణయాలను చూసి రాజకీయ వర్గాలు షాక్ ఆయ్యాయి. వాటిలో ఒకటి తన మ్యానిఫెస్టోలో 60 ఏళ్ళ పైబడి రైతులకు పెన్షన్,రెండవది బీఎస్పీ తో పొత్తు.
ప్రధానంగా బీఎస్పీ తో పొత్తు విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.మాయావతి గారికి రెండు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన అభిమానులతో పాటు, స్టాండర్డ్ వోట్ బ్యాంక్ కూడా ఉంది.దీనితో పాటు ఇప్పటివరకు బీఎస్పీ పార్టీని తెలుగు రాష్ట్రాల్లో టికెట్ కోసమో,సింబల్ కోసమో పార్టీ టికెట్ తెచ్చుకొని గెలిచాక అధికార పార్టీలో చేరి అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టిన సందర్భాలు ఉన్నాయి.కానీ తెలుగు రాజకీయ చరిత్రలో మొదటిసారిగా అంబెడ్కర్ ఆశయాలకు అనుగుణంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం బీఎస్పీ తో జనసేన పొత్తు పెట్టుకుంది.అయితె వీరి మధ్య పొత్తుకు ఎవరు కృషి చేశారో అని ప్రజలు అనుకుంటున్న తరుణంలో పవన్ కి అత్యంత సన్నిహితుడైన ఒక ఆంధ్ర ప్రభుత్వ గ్రూప్1 ఉద్యోగి ఉన్నట్లు తెలుస్తుంది.ఈయన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దళితులను,బీసీలను,మైనారిటీలను కలపడానికి క్షేత్ర స్థాయిలో ఎన్నో ఉద్యమాలు చేయటం వల్ల మాయావతి వర్గాలకు అత్యంత సన్నిహితుడుగా మారినట్లు సమాచారం.ఈయన గత ఏడాది కాలంగా తెరవెనుక చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here