మహబూబ్ నగర్ NTV స్టాఫ్ రిపోర్టర్ అహ్మద్ పాష, కెమెరామెన్ శ్రీనివాస్ , T NEWS స్టాఫ్ రిపోర్టర్ నరేష్ ఐసోలేషన్ కు (మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ) తరలించారు. వీరితోపాటు ఫ్రైమ్ 9 న్యూస్ స్టాప్ రిపోర్టర్ శంకర్ (కొత్తకోట) , AP 24/7 స్టాప్ రిపోర్టర్ హరిశంకర్ (గద్వాల) కూడా ఉన్నారు. వీరిని ఆయా ఏరియాల్లో ఐసోలేషన్ కు తరలించారు. ఐతే ఇటీవల కరోనాతో మృతి చెందిన తన అనుచరుడి అంత్యక్రియలలో పాల్గొన్నందుకు హోమ్ క్వారంటైన్ కు పరిమితమైన గద్వాల ఎమ్మెల్యే క్రిష్ణమోహన్ రెడ్డి ను జర్నలిస్టులు 5 రోజుల క్రితం
కాంటాక్ట్ అయినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఐతే వీరు ఆరోజు ఎమ్మెల్యే ఇంట్లో చాలాసేపు గడపటంతోపాటు అతనితో కలసి భోజనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు గద్వాల NTV రిపోర్టర్ తమ్ముడికి కరోనా పాజిటివ్ వచ్చింది. వాళ్ల ఇంటికి కూడా NTV టీం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారంతో ముందు జాగ్రత్తగా జర్నలిస్టులను ఐసోలేషన్ కు తరలించారు.
