మహా చండీయాగంతో తెలంగాణకు ఫలాలు

0
1838

అవును…. అని అంటున్నారు తెలుగు రాష్ట్రల పురోహితులు. తెలంగాణ రాష్ట్రం సిద్దించాక ప్రజల్లో ఒకవైపు సంతోషం ఉన్న మరో వైపు నిరాశ నిస్పృహలు ఉండేవి. అల్లుడు నోట్లో శని ఉన్నట్లు సాఫ్ట్ వెర్ రంగం,విద్య రంగం ,రియల్ రంగం ఇలా అన్ని ఊపందుకున్నాయి కానీ వర్షాలు లేక తెలంగాణ వెన్నుముక అయిన వ్యవసాయ రంగం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఇది గత ఏడాది వరకు మాట. ఈ పరిణామాలను గమనించిన తెలంగాణ పురోహితులు , చండియాగం చెస్తే పరిణామాలు బాగుంటాయని సలహా ఇచ్చారు. గతంలో రాజులు కూడా తమ రాజ్యంలో ఏమైనా విపత్కర పరిస్థితులు ఏర్పడితే ఇలాంటి యాగాలు చేసేవారు. చరిత్రలో అశ్వమేధ యాగం ,రాజసూయ యాగం లాంటివి కూడా ఇలాంటివే. వాళ్ళ సలహా తో తెలంగాణ సీఎం కేసీఆర్ మహా చండి యాగాన్ని అంగరంగ వైభవంగా గత నవంబర్ లో చేసాడు. దేశంలోని అతిపెద్ద యాగంగా అది అభివర్ణించబడింది. రాష్రపతి ,కేంద్ర మంత్రులు ,రాష్ట్రాల సీఎంలు ,మంత్రులు ,సినీ నటులు ఇలా దేశంలో ఉన్న సెలెబ్రెటీలు ఆ యాగాన్ని సందర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆ యాగాన్ని చూడటానికి పోటీ పడ్డారు. చివరికి కేసీఆర్ గవర్నమంట్ కి మంచి పేరు తెచ్చింది.

అయితే యాదృఛ్చికమో లేక చండి యాగ ఫలితమో కానీ తెలంగాణ లో ఎప్పుడు లేని విదంగా మే నెల నుంచే వర్షాలు మొదలయ్యాయి. ఇక జూన్ జులై వచ్చేసరికి తెలంగాణ మొత్తం మబ్బులతో నిండిపోయింది. చెరువులు నిండిపోతున్నాయి,వాగులకు జలసిరి వచ్చింది. గోదావరి ,క్రిష్ణా,మంజీరా నదులు ఎగిసిపడుతున్నాయి. నాగార్జున సాగర్ ,పోచంపాడ్ ,శ్రీరాంసాగర్ ,కడెం ప్రోజెక్టుల గేట్లను ఈ రోజా రేపు ఓపెన్ చేసే అవకాశం వచ్చింది. ఇక చాలా ఏళ్ళుగా తన కళ కోల్పోయిన కుంతలా జలపాతం అయితే ఎప్పుడు లేని విదంగా అందంగా తయారైంది. ఇది ఏమైనా చండీయాగం చేస్తే ప్రకృతి కనికరిస్తుందనే సెంటిమెంట్ మరోసారి రుజువు అయింది.

వ్యాసకర్త :కొత్తింటి రాజన్న (ఆర్మూర్ డివిజన్  )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here