రాకేష్ మాస్టర్ కి లీగల్ నోటీసులు పంపిన మాధవి లత

 

గత కొన్ని రోజులుగా రాకేష్‌ మాస్టర్‌ సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నారు. చిరంజీవి మొదలు గుర్తు వచ్చిన వారినల్లా బూతులతో సైతం విరుచుకుపడుతున్నారు.అతడి వ్యాఖ్యలతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆయన చర్చనీయాంశం అవుతున్నారు. ప్రతి ఒక్కరు ఆయన మీద చర్యలు తీసుకోవాటానికి భయపడ్తే మాధవీలత మాత్రం అందరికి భిన్నంగా ఆయనకు లీగల్ నోటీసులు పంపారు. తనను సోషల్ మీడియాలో అసభ్యకర రీతిలో చిత్రీకరించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆమె తన లీగల్ నోటీసులలో పేర్కొన్నారు.

కొంతకాలం నుంచి రాకేష్ మాస్టర్ తన పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ పలు యూట్యూబ్ ఛానెల్స్ లో తన పరువు తీసేలా మాట్లాడుతున్నారని ఆమె నోటీసులలో పేర్కొన్నారు. లీగల్ నోటిస్ కి వారం రోజుల్లోగాసమాధానం ఇవ్వని పక్షంలో తదుపరి చర్యలకు వెళ్తానoటూ మాధవి లత హెచ్చరించారు. అసలు రాకేష్‌ మాస్టర్‌ ఎవరో తనకు తెలియదని పేర్కొన్న ఆమె అతని వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని ఆమె పేర్కోన్నారు. ఇక తన మీద చేసిన కామెంట్స్ ని వెనక్కు తీసుకుని సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో లీగల్ గా ముందుకు వెళ్ళాల్సి వస్తుందని హెచ్చరించారు. క్షమాపణలు చెప్పని పక్షంలో రాకేష్‌ మాస్టర్‌ ను ఉపేక్షించేది లేదని కోర్టు, పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కించే దాకా ఊరుకోనని హెచ్చరించారు

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close