-
ఆధార్ వివరాలను వారి వారి మొబైల్ ఫోన్లోనే చూసుకునేందుకు మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ( UIDAI). ఈ యాప్ ద్వారా త్వరగా, సౌకర్యవంతంగా గుర్తింపు రుజువును భద్రపరుచుకోవచ్చు. అంతేకాకుండా ఈ యాప్ ద్వారా ఆధార్‌కు అనుసంధానం చేసిన బయోమెట్రిక్ సమాచారాన్ని కట్టుదిట్టంగా భద్రపరచేందుకు తమకు నచ్చినపుడు తిరిగి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
-
ఈ యాప్(‘ఎంఆధార్’ను) గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించుకోవాలంటే ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ ఫోన్ నంబరు ఉండాలి. ప్రస్తుతం ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫారంపైన మాత్రమే అందుబాటులో ఉంది.