ప్రామిసింగ్ కథనంతో లవ్ ప్రామిస్ షార్ట్ ఫిల్మ్

0
539

ఒకప్పుడు సినిమా చూడాలంటె కేవలం థియేటర్ కి వెళ్లి చూడాల్సిందే లేకపోతె టివిలో చూడాల్సిందే . కాని ఎప్పుడైతే యూట్యూబ్ బూమ్ మొదలైందో అప్పటి నుంచి షార్ట్ ఫిలిం ల వెల్లువ ఎక్కువైంది. ఇక తెలుగులో ఐతే షార్ట్ ఫిలిమ్స్ రోజుకి ఎన్నో వస్తుంటాయి. అమెరికాలో చదువుకునే తెలుగు కుర్రాళ్ళు మంచి dslr కేమెరా కొనుక్కొని తమ రెండో వైపు ఉన్న టాలెంట్ వెలికితీసే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు చాల మంది. గత 4 ఏళ్లుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కుర్రాళ్ళు కూడా తమ టాలెంట్ కి పదును పెడుతూ తమ అడుగులను మెల్లి మెల్లగా సినిమా ఇండస్ట్రీ వైపు వేస్తున్నారు. ఆ క్రమంలో చాలా మంది ఇండస్ట్రీలో సెట్ అయ్యారు. ఐతే 4జి డేటా ఉచితం వలన ప్రతి ఒక్కరు షార్ట్ ఫిలిం తీస్తూ రొటీన్ సినిమాలు ఎక్కువ కావటంతో యూట్యూబ్ లోని షార్ట్ ఫిల్ములు బోరింగ్ గా మారిపోయాయి.

ఐతే నిజామాబాద్ జిల్లాకు చెందిన వర్ణం శ్రీనివాస్ అనే యువకుడు నిర్మాత గా మారి లవ్ ప్రామిస్ అనే సినిమా ని చాలా కొత్త కాన్సెప్టుతో దాదాపు 40 నిమిషాల వ్యవధితో మంచి కథనంతో ,నటీనటులతో ,ఫీచర్ ఫిలిం ని తలపించేలా సినిమా తీసాడు. కొత్తగా ఉండే కామెడీ ,ఎమోషన్స్ ,లవ్ సాంగ్స్ తో ఎక్కడ బోర్ కొట్టకుండా తీయించాడు. మాములుగా ఒక షార్ట్ ఫిలిం 10 నిముషాలు కన్నా ఎక్కువ ఉంటె బోర్ కొడుతోంది. 40 నిముషాలు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమా తీసాడంటే రచయిత దర్శకుడు కొత్తపల్లి శేషు మీద నిర్మాత విశ్వాసం తెలియచేస్తుంది.

రానున్న రోజుల్లో ఫీచర్ ఫిలిం ని తీస్తామని షార్ట్ ఫిలిం బృందం తెలియచేసింది. మనం కూడా అల్ ది బెస్ట్ చెబుతామా మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here