అద్వానిని ముంచేసిన శత్రువులు ఎవరు ?

0
1765

 

    కొందరు కష్టపడి చెమటోడిస్తే ఫలితాలు సాధిస్తారు ,కొందరు కష్టపడకుండానే అదృష్టం వలన విజయం సాధిస్తారు. మరి కొందరు ఎంత కష్టపడినా కూడా దురదృష్టం వలన చతికిలపడిపోతారు. కాని కొందరు జీవితం మొత్తం కస్టపడి జీవితాన్ని త్యాగం చేస్తే ఫలితం మాత్రం పక్క వాళ్లకు వరిస్తుంది. అలాంటి కోవలోకి వస్తారు బిజెపి సీనియర్ నాయకులు ఎల్కె అద్వానీ. అసలు విషయానికొస్తే గత ఎన్నికల్లో ప్రధాని అవుతాడనుకొని జరక్కపోగా ఈ సారి రాష్ట్రపతి పదవి అయిన వరిస్తుందని దేశం మొత్తం భావించింది. కాని అద్వానీ గారికి ఆ అదృష్టం వరించలేదు. అయితే ఈ పరిణామాన్ని చూసిన దేశ ప్రజలు అద్వానికి మోసం జరిగిందని ,మోడీ అన్యాయం చేశాడని అంటున్నారు ..అయితే ఆయనకు అన్యాయం జరిగిందనే కన్న అదృష్టం ఆయనకు వరించలేదు అనటం సబబు. అందరు అనుకున్నట్లు ఆయనకు శత్రువు మోడీ కాదు . మరి అయన శత్రువులు ఎవరో అయన చరిత్ర ని చూసి తెలుసుందాం.

 

  • 1991 రామ్ మందిర్ ఉద్యమంలో దేశం మొత్తం తిరిగి ప్రధానమంత్రి అవుతాడని అనుకున్న సమయంలో రాజీవ్ గాంధీ హత్యవలన కాంగ్రెస్ కి సానుభూతి పవనాలు వీచి మైనారిటీ ప్రభుత్వంతో పివి నరసింహ్మ రావు గారు ప్రధాని అయ్యాడు.
  • 1996 ఎన్నికలు వచ్చేసరికి అద్వానీ పైన హవాలా కేసుల వలన వాజపేయి ని రంగంలోకి తెచ్చింది బిజెపి … అలా 1996,1998,1999 లో వాజపేయి ప్రధాని కావటం తరవాత వాజపేయి కి alternative గా అద్వానీ ఎదగకపోవటం వలన ప్రధాని అయ్యే అవకాశాలు చేజారాయి .
  • ఇక 2004,2009 ఎన్నికల్లో వాజపేయి కి అనారోగ్య కారణాల వలన ప్రధాని అభ్యర్థిగా అద్వానీ ని ఎన్నుకుంది బీజేపీ … కాని కాంగ్రెస్ హవా ముందు బీజీపీ చతికిల పడిపోయింది.
  • మళ్ళి 2014 లో బీజేపీ కి అవకాశం వచ్చినా కూడా గుజరాత్ లాబీయింగ్,RSS మోడీ మద్దతుగా నిలిచింది. దీని వలన నిరుత్సాహ పడ్డ అద్వాని చివరికి బిజెపి వాళ్ళు తనకు రాష్ట్రపతిని చేసి గౌరవంగా రిటైర్ అయ్యే అవకాశం ఇస్తారని అనుకున్నాడట కాని ఈ సారి రాంనాథ్ కోవింద్ ని రంగంలోకి దింపి అద్వానికి షాక్ నిచ్చింది బీజేపీ .
    ఇలా అద్వానికి దురదృష్టం శత్రువులా వెంటాడి అయన జీవితంలో పడ్డ కష్టానికి ఫలితాలు రాకుండా చేశాయి. ఏది ఏమైనా అయన దురదృష్టం వలన ప్రధాన మంత్రులు అయిన పివి ,వాజపేయి ,మోడీలు భారతదేశానికి వన్నె తెచ్చిన ప్రధానులు కావటం కొసమెరుపు.

Author:Ravinder Ryada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here