మహానటి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు

0
497
  • మహనటిలో చుట్టూ మంటలు ఉన్నా కూడా సావిత్రిగారు తన చేతిలో ఉన్న మందు బాటిల్ ఎక్కడ చేజారిపోతుందని దర్శకుడు చూయించిన తీరు సూపర్బ్… ఆమె లోపల ఉన్న మంట కన్నా బయట మంటలు పెద్దవి కావని..వాటిని ఆర్పించే ఆయుధం మందు బాటిల్ ని రక్షించుకోవడం తన కర్తవ్యం అని చాలా బాగా చూయించారు.
  • ఒక పాటలో జెమినీ గణేశన్ ,సావిత్రి నింగికి నిచ్చెన వేసి ఎక్కుతుంటారు దీని వెనుక సినిమా జీవితాలు కూడా అలాంటివే అని డైరెక్టర్ చూయించాడు. సావిత్రి కూడా డబ్బులు ఉన్నపుడు ఉన్న దాంట్లోనే సరిపెట్టుకోకుండా ఎక్కువ ఆశలకు పోయి సినిమాలు నిర్మించి చివరికి అనాధల మిగిలిపోయింది. వైభవం అందరికి వస్తుంది కాని వచ్చినపుడు నిలబెట్టుకోవటంలోనే సక్సెస్ ఉంటుంది. ఉదాహరణకి సావిత్రి ఇంట్లో బంగారు ఆభరణాలు చేయటానికి ఇంట్లో కంసాలిని పెట్టుకుంటుంది. ఒకపుడు రాముడి ఇంట్లో మాత్రమే కంసాలి ఉండేవాడట అని ఒక మాట ఉంటుంది. సావిత్రి కూడా లేని వైభోగాలకు వెళ్లి చేతులు కాల్చుకుంది. తాను ఒక పేద ఇంటి నుంచి వచ్చానని విషయం మర్చిపోయి దానాలతో ఎక్కడ మొదలు పెట్టిందో అక్కడే మిగిలిపోయింది. ఆమె చిన్నప్పుడే వాళ్ళ నాన్నను కోల్పోయి చనిపోయినపుడు కూడా ఎవరూ లేని అనాధ గా చనిపోయింది.
  • సినిమా చుట్టూ చాణక్య నీతులు ,ఓషో సిద్ధాంతాలతో అల్లుకుంది. ఉదాహరణకి సావిత్రికి ఎంత టాలెంట్ ఉన్నా కూడా చాణక్య నీతులు పాటించక పోవటంతో జీవితంలో ఓడిపోయింది,జెమినీ గణేశన్ ఓషో సిద్ధాంతాలతో పాటించటంతో సావిత్రి జీవితం నేల పాలైంది. ఓషో సిద్ధాంతాలు ఇండియాలో పాటిస్తే జీవితాలు సర్వ నాశనం అవుతాయని మనకో గుణ పాఠం.
  • సావిత్రికి షుగర్ వచ్చినపుడు ఆమె పొందే వేదన వర్ణనాతీతం సినిమా స్టార్లు కూడా మాములు మనుషులే అని ఆమె తెలుసుకునే సన్నివేశం సూపర్బ్.
  • ఆమె అన్ని కోల్పోయి సాధారణంగా ఉన్నపుడు టాక్స్ డ్రైయివేర్ కి సహాయం చేసే సన్నివేశం చూస్తే ఆమెలో ఉన్న దాన స్వభావం కలియుగంలో కర్ణుడి అవతారం ఎత్తిన మనిషిలా కనిపిస్తుంది.
  • సావిత్రి గారు బాగా బతికిన రోజుల్లో ఆమె డిమాండ్ ను use చేసుకొన్నారు,ఆమె దీనస్థితిలో ఉన్నపుడు sv రంగారావు గారు తప్ప ఒక్క స్టార్ కూడా ఆమెను ఆదుకోలేకపోయారు.. దీన్ని బట్టి చూస్తే సినిమాలో ప్రతి ఒకరు కూడా డిమాండ్ కె అవకాశాలు ఇస్తారని మానవ సంబంధాలు ఉండవని చెప్పుకొచ్చాడు డైరెక్టర్.

ఇలా చెప్పుకుంటూ పొతే మహానటి గురించి నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ రాసిన ,మధురవాణి ఆర్టికల్ రాసిన ,రవిందర్ ర్యాడ సినిమా రివ్యూ రాయాల్సి వచ్చిన రాసే పెన్నులో ఇంకు ,రాసేవాళ్ళ గుండెల్లో కన్నీళ్లు ఇంకిపోవు….

Ravinder Ryada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here