మిస్ విజయవాడ 2019 గా లహరి జూలూరి

0
105

అందం, అభినయం, ఆహార్యం, తెలివితేటలు కలబోతగా నిర్వహించిన పోటీలో కిరీటం కోసం 12 మంది అమ్మాయిలు పోటీపడ్డారు. విజేతగా లహరి జూలూరి ఎంపికవ్వగా…ఫస్ట్‌ రన్నరప్‌గా సుమశ్రీ , సెకండ్‌ రన్నరప్‌గా భావన ఎన్నికయ్యారు.

మిస్ విజయవాడ 2019 కిరీటాన్ని లహరి జూలూరి , గెలుచుకున్నారు. క్రియేటివ్‌ ఈవెంట్స్‌కు చెందిన సతీష్‌ అడ్డాల ఆధ్వర్యంలో విజయవాడలోని మొగల్రాజపురం లోని కే స్ట్రీట్ (K Street) లో జరిగిన మిస్ విజయవాడ 2019 పోటీలు ముగిశాయి. అందాల కిరీటం కోసం ముద్దుగుమ్మలు పోటీపడుతూ.. ర్యాంప్‌పై హొయలు పోయారు. తొలుత జరిగిన ఫ్యాషన్‌ షోలో మోడళ్లు సంప్రదాయ వస్త్రధారణలో క్యాట్‌వాక్‌ చేశారు. చివరిగా విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు సతీష్‌ అడ్డాల మాట్లాడుతూ పోటీల్లో 185 మంది పాల్గొన్నారని తెలిపారు. యువకుల్లో 12 మంది, యువతుల్లో 12 మంది ఫైనల్స్‌ వరకు వచ్చారని చెప్పారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సినీనటి భవ్యశ్రీ మాట్లాడుతూ యువతీ యువకుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ఇలాంటి పోటీలు ఉపయోగపడతాయన్నారు. ఈ పోటీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మోడల్‌ అలేఖ్య ఏంజెల్‌ వ్యవహరించారు. కార్యక్రమం చివర్లో చిన్నపిల్లలతో సంప్రదాయక ఫ్యాషన్‌ షో నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here