కుమారి-21 F రివ్వూ : సుకుమార్ చేతిలో మారుతీ సినిమా

1
395

కుమారి-21ఎఫ్ మూవీ రివ్వూ

దశాబ్ద కాలం క్రీతం పేస్ బుక్ ,ఆర్కుట్ ,whats అప్ లు లేనపుడు యహూ messanger ఉండేవి అపుడు ఈ యూత్ ని కదిలించిన కూడా చాట్ చాట్ అని పరిగెత్తేవారు. ముఖ్యంగా ప్రొఫైల్ పేర్లు సంధ్య 17 F ,గణేష్ 21 m అని ఉండేవి . ఆ ముసుగు వేసుగు వేసుకొని కాహల మంది అబ్బాయిలు అమ్మాయిలను ,అమ్మాయిలు అబ్బాయిలని ఇలా ఒకరినొకరు మోసం చేసుకొని కాలం గడిపే వారు . అలంటి profile తో ఈ రోజు సుకుమార్ నిర్మాణంలో కుమారి 21 F అని ఒక సినిమా విడులైంది . మరి క్యూట్ టైటిల్ పెట్టుకొని ప్రేక్షకులను మోసం చేసారా లేక కన్విన్సు చేసారా సమీక్షా లో చూద్దాం.

క‌థ‌:
రాజ్ త‌రుణ్‌ కి కేట‌రింగ్ అంటే ఇష్టం. సింగ‌పూర్ వెళ్లి షిప్‌లో కుక్‌గా చేరాలనుకుంటాడు. అత‌ని త‌ల్లిదండ్రులు విడిపోయి ఉంటారు. సిద్ధుకి ముగ్గురు ఫ్రెండ్స్. వారు ఏటీయంలు కొల్ల‌గొట్టి ద‌ర్జాగా జీవ‌నం సాగిస్తుంటారు. వాళ్ళ‌తో స్నేహం మాన‌మ‌ని త‌ల్లి చెప్పినా సిద్ధు మాన‌డు. అలాంటి స‌మ‌యంలో సిద్ధుకి కుమారి (హేబా) ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఆమె మోడ‌ల్‌. ఆమె వృత్తిని ప్ర‌తిఫ‌లించే విధంగానే ఆమె వ‌స్త్రాధర‌ణ ఉంటుంది. ఆమెకు హీరో తొలి చూపులోనే న‌చ్చేస్తాడు. అత‌నికి కూడా ఆమె అంటే ఇష్ట‌మే. అయితే ఆమె ఫ్రెష్షా? కాదా? వ‌ర్జినా? అనే అనుమానాల‌ను హీరోకి అత‌ని స్నేహితులు లేవ‌నెత్తుతుంటారు. అలాంటిది హీరో త‌న అనుమానాల నుంచి ఎలా బ‌య‌ట‌పడ్డాడు?

కథనం
ఓ వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించాలని.. అవతలి వ్యక్తి మంచి – చెడులు రెంటినీ యాక్సెప్ట్ చేయాలని.. ప్రేమలో అనుమానాలు ఉండొద్దని.. అన్నింటికంటే నమ్మకం అనేది ప్రేమలో అత్యంత ముఖ్యమైన విషయమని చెప్పే ప్రయత్నం చేశాడు కథకుడు సుకుమార్. ఐతే డైరెక్టుగా మెసేజ్ ఇస్తే ఎవరూ చూడరు కదా. అందుకే తనదైన శైలిలో యూత్ కి గిలిగింతలు పెట్టే మసాలా అద్దాడు.
తన నమ్మి సినిమాలకు వచ్చేది యూతే కాబట్టి సుకుమార్ వాళ్లనే టార్గెట్ చేశాడు. మిగతా ప్రేక్షకుల గురించి ఆలోచించలేదు. దీంతో సన్నివేశాలు – మాటలు అన్నీ కూడా చాలా బోల్డ్ గా ఉంటాయి. సినిమాలో హీరో హీరోయిన్లు పదే పదే ‘మెచ్యూరిటీ’ అనే మాట వాడుతుంటారు. అలాగే సినిమాలోని ‘బోల్డ్ నెస్’ని యాక్సెప్ట్ చేసే మెచ్యూరిటీ ఉంటే ‘కుమారి 21 ఎఫ్’ చూడొచ్చు.

నటీనటులు-

తొలి రెండు సినిమాల్లో బాగా దూకుడున్న పాత్రల్లో కనిపించిన రాజ్ తరుణ్.. ఈసారి కొంచెం భిన్నమైన క్యారెక్టర్ చేశాడు. అమాయకత్వం – కన్ఫ్యూజన్ నిండిన పాత్రను చాలా బాగా చేసి తనలోని కొత్త కోణాన్ని జనాలకు పరిచయం చేశాడు. క్లైమాక్స్ లో అతడి నటన సూపర్బ్. హీరోయిన్ హీబా పటేల్ ను ముందు ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు అభినందించాలి. పాత్రకు యాప్ట్ గా అనిపించిందామె. తన అందచందాలతో కుర్రాళ్లను కట్టి పడేసిందా అమ్మాయి. నటన కూడా ఓకే. హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ లోని ముగ్గురూ సహజంగా నటించారు. నోయల్ సీరియస్ గా కనిపిస్తే.. మిగతా ఇద్దరూ పంచ్ లతో వినోదం పంచారు.

ప్లస్ పాయింట్స్
1) సుకుమార్ అందించిన కథ
2) నటి నటులు
3) సంగీతం

మైనస్ పాయింట్స్
1) బూతు సినిమా గా కనిపిస్తుంది
2) దర్శకత్వం

నటీనటులు- రాజ్ తరుణ్ – హీబా పటేల్ – హేమ – నోయల్ తదితరులు
సంగీతం- దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం- రత్నవేలు
కథ – స్క్రీన్ ప్లే- సుకుమార్
నిర్మాతలు- విజయ ప్రసాద్ బండ్రెడ్డి – థామస్ రెడ్డి ఆదూరి
దర్శకత్వం- పల్నాటి సూర్య ప్రతాప్
VERDICT : సుకుమార్ చేతిలో మారుతీ సినిమా
రేటింగ్: 3/5

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here