మంచి ఊపులో ఉన్న కేటీఆర్

0
1080

గ్రేటర్ ఎన్నికల ఫలితాల పుణ్యమో లేక ప్రపంచ ఐటి కంపెనీలు హైదరాబాద్ వచ్చిన ఊపో కానీ తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ ఫుల్లు జోషులో ఉన్నాడు . హైదరాబాద్ లో ఏదైనా సమస్య గురుంచి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే చాలు దానికి సంబంధించి స్పందన వెంటనే వస్తుంది. ఇప్పటి వరకు రోడ్ల గురుంచి ,డ్రైనేజీ గురుంచి ,చెత్త గురుంచి ఎవరైనా ట్విట్ చేస్తే చాలు,వాటిని 24 గంటల్లో పరిష్కరించాడు. ఇవన్నీ ఒక ఎత్తు ఐతే ఇటీవల ఆయనకు వచ్చిన ట్విట్ మరొక ఎత్తు.

అసలు విషయానికొస్తే… హైదరాబాదు మెట్రో మార్గంలోని ఓ పిల్లర్ విరిగిపోయిందని, అది కూలిపోయే ప్రమాదముందని ఈ మధ్యన ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్‌లలో చక్కర్లు కొడుతోంది. అది కాస్త కేటీఆర్ వాల్‌ చేరింది .కానీ కేటీఆర్ ఎంక్వయిరీ చేసి ట్విట్టర్ లో స్పందించాడు. ఇది మెట్రో రైల్ ది , పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేకి సంబంధించిన ఫొటో కాదన్నారు. అసలు ఇది మన హైదరాబాదుకు సంబంధం లేదని , పాకిస్తాన్‌లోని రావల్పిండిలో మెట్రో బస్సు బ్రిడ్జీకి సంబంధిచిన ఫొటో అని తెలిపారు. అసలు ఒక సెలెబ్రటీ మహా సముద్రం లాంటి ట్విట్టర్ ని ఫాలో కావటమే గొప్ప విషయం అందులో ప్రతి విషయాన్ని పరిశీలించటం అంటే చాల అరుదైన విషయమని చెప్పాలి.

 

Rawalpindi Islamabad Metro‬ Design fault

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here