పైసలడిగితే నిలదీయండి: కే టి ఆర్

0
321
KTR VISITS MAHABUB NAGAR
KTR VISITS MAHABUB NAGAR

మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులను ఐటీ, పురపాలక శాఖ మంత్రి  కేటీఆర్‌ మంగళవారం ఉదయం పరిశీలించారు. డబుల్ బెడ్‌రూం ఇళ‍్ల విషయంలో ఎవరైనా పైసలడిగితే అడిగితే నిలదీయండని  విజ‍్ఞప్తి  చేసారు.. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభ లో  ఆయన మాట్లాడుతూ ఇండ్ల విషయంలో దళారులని నమ్మి మోసపోవద్దని ప్రజలకి సూచించారు. పేదవాడి ఆత్మగౌరవానికి డబుల్ బెడ్ రూం ఇండ్లు  ప్రతీక అని కే టి ఆర్ పేర్కొన్నారు.గత పాలకులు ప్రజలకి చేసిన మోసాలని వివరిస్తూ వారికి చురకలంటిచారు.

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రజలందరు సద్వినియోగం చేస్కొవాలని, పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోని ముఖ్యమంత్రి కే సి అర్ రెండు పడక గదుల ఇండ్లు నిర్మిస్తున్నారని తెలియజేసాడు. అలాగే పేదింటి ఆడపిల్లల పెళ్ళిళకు కళ్యాణలక్ష్మి పథకం కింద 75,000 రూపాయలు అందిస్తూన్నారని సభలో పేర్కొన్నారు. ఈ సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ జితేందర్‌రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here