డిజితాన్ కి అండగా నిలుస్తున్న ఎన్నారైలకు కేటీఆర్ ప్రశంసలు

0
422

తెలంగాణ ఐటి మంత్రిత్వ శాఖ ,తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలాజీ అసోసియేషన్ (TITA) ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్న డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమం డిజితాన్ కి అండగా నిలుస్తున్న తెలంగాణ ఎన్నారైలకు కేటీఆర్ ప్రశంసలు కురిపించాడు. ఇటీవల అమెరికాలో జరిగిన ఆటా సభల్లో కొందరు ఎన్నారైలు ముందుకొచ్చి తమ గ్రామాలను దత్తత తీసుకొని డిజిటల్ గ్రామాలను మార్చటానికి డిజితాన్ లో భాగం అయిన విషయం సంగతి తెల్సిందే. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఐటి సెక్రటరీ రంజన్ తో కలిసి టి-బ్రిడ్జ్ ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ , రా ష్ట్రంలో డిజిటల్ అక్షరాస్యత పెరుగుదల రేట్ పై ఆనందాన్ని వ్యక్తపరిచారు.                                     ఇప్పర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్న వినయ్ మేరెడ్డి మాట్లాడుతూ “తెలంగాణా గ్రామాలను సంపూర్ణ డిజిటల్ గ్రామాలను మార్చాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న టీటా అధ్యక్షుడు మక్తాల ,ఉపాధ్యక్షుడు రానా ప్రతాప్ బొజ్జం మరియు వాళ్ళ టీం సేవలు అమోఘం . నా గ్రామానికి నాకు సాధ్యమయ్యే సేవలు చేసే అవకాశం ఇచ్చిన టీటా కి నా కృతఙ్ఞతలు. ”                                          వేల్పూర్ గ్రామంలో 30 మంది మహిళలకు డిజిటల్ పాఠాలను నేర్పిస్తానని ముందుకొచ్చిన  ఎన్నారై     కొత్త రుచిక మాట్లాడుతూ ” ఒక కుటుంబం ,వ్యవస్థ అభివృద్ధికి మహిళల పాత్ర చాల కీలకం. మహిళలకు మంచి జ్ఞానం ,ట్రైనింగ్ ఇస్తే కచ్చితంగా ఒక గొలుసు రియాక్షన్ ఫలితాలను ఒక వ్యవస్థకు ఇవ్వొచ్చు. మా నాన్న జన్మించిన ప్రదేశానికి దగ్గర కావాలంటే ,వారికి సేవలు అందించాలంటే డిజితాన్ కన్న పెద్ద అవకాశం ఉండదు. ఈ అవకాశాన్ని ఇచ్చిన తీటా కి మా కుటుంబం తరపున ధన్యవాదాలు. ”                             img-20161015-wa0095                                                                       ఈ కార్యక్రమంలో ఐటి సెక్రటరీ రంజన్,వినయ్ మేరెడ్డి ,సాగర్ కొత్త ,టీటా కెనడా చాప్టర్ ఇంచార్జీ రాధికా గవ్వల ,కొత్త రుచిక,రాణి కొత్త ,గోపి శ్రీనేని , శ్రీకాంత్ ఎనగంటి హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here