నేతల ట్విటర్ కొట్లాటా..!

0
533
digvijay - ktr twitter fight
digvijay - ktr twitter fight
    ప్రముఖులు వారి వారి విషయాలని ప్రజలకి చేర్చే విధానంలో సోషల్ మీడియాని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ప్రజలకి, ప్రముఖులకి మధ్య ఈ సోషల్ మీడియా సంధాన కర్తలా ఉంటుంది. అవి ప్రజల యోగ క్షేమాలపైన కావోచ్చు లేదా ఎదైన అత్యవసర విషయమో కావోచ్చు.
    సోషల్ మీడియా లో ట్విటర్ ద్వార ప్రముఖులు చేసే ట్వీట్స్ ప్రజలను భయాందోళనలకి గురి చేస్తున్నాయి. ప్రజా నాయకులే ఈ విధంగా ప్రజలని భయాందోళనలకి గురిచేయడం బాధించే విషయమే. రాష్ట్ర రక్షణలో తమ జీవితాలు సైతం పనంగా పెట్టి పని చేస్తున్న తెలంగాణా పోలీసు వ్యవస్థపై మండిపడుతూ ఈ రోజు ఉదయం దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్స్ పోలీసులపై ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టేలా ఉన్నాయి. ఈ ట్వీట్స్ వల్ల తన భాధ్యతా రాహిత్యాన్ని చూపిస్తూనట్లూ తెలుస్తుంది.
    తెలంగాణ పోలీసులు ఒక బోగస్ ఐఎస్ఐఎస్ సైట్‌ని ఏర్పాటు చేసి, ముస్లిం యువకులను ఐసిస్‌లో చేరేందుకు ప్రోత్సహిస్తున్నారని దిగ్విజయ్ సింగ్ చేసిన ట్వీట్ కి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటిఆర్ గట్టిగా సమాధానం ఇచ్చాడు. భేషరత్తుగా తాను చేసిన ట్వీట్ ని వెనక్కి తీసుకోవాలని , సరైన సాక్ష్యాలు ఉంటే నిరూపించాలని ట్వీట్ చేసాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here