బెంగళూరులో సెప్టెంబర్ 22న KRTA ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

0
113
సెప్టెంబరు 22 వ తేదీన సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకు రవీంద్ర కళా క్షేత్రలో జేసీ రోడ్ ,బెంగుళూరు లో కన్నడ రాష్ట్రా తెలంగాణ అసోసియేషన్ (కె.ఆర్.టి.ఎ.) సంస్థ తెలంగాణ,& కర్ణాటక సంస్కృతి శాఖతో కలిసి బతుకమ్మ సంబరాలను జరుపబోతున్నారు .

 

KRTA వ్యవస్థాపిక అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాలా మాట్లాడుతూ “”బతుకమ్మ పండగ అనేది తెలంగాణ రాష్ట్రం లో అతి ముఖ్యమైన పండగ . కర్ణాటకలో మొదటిసారిగా జరగబోతున్న ఈ ఉత్సవానికి రాష్టంలోని ప్రతి కుటుంభ సభ్యుడిని ఈ వేడుకకి KRTA ఆహ్వానిస్తుంది.దాండియా నృత్యాలతో కూడిన ఈ వేడుక ఖచ్చితంగా అందరిని ఆకర్షిస్తాయని నమ్మకం ఉంది

బతుకమ్మ ఉత్సవం తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచిస్తుంది. దాని వెనుక అనేక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. కాలానుగుణ పూలతో ఏర్పాటు చేసిన బతుమ్మలో అనేక అనేక ఔషధ విలువలను కలిగి ఉంటాయి . ఈ ఉత్సవంలో ఉపయోగించిన వివిధ పువ్వులు బెంజిన్, అమోనియా వాయువులను గాలిలో గ్రహించి వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి. ఈ పువ్వులు యాంటీ డయాబెటిక్ కలిగి ఉంటాయి. భారత మ్యారిగోల్డ్ పుష్పం కీటకాలు, దోమలకి వికర్షకంగా పనిచేస్తుంది. క్రిసాన్తిమం పువ్వులు మంటలు, కంటి వ్యాధులు, గాయాలను, జ్వరం మరియు అజీర్తి నయం కోసం ఉపయోగిస్తారు. బతుకమ్మ ని నదిలో / సరస్సులో నిమజ్జనం చేయటానికి గల కారణం ఆకులు మరియు పువ్వుల ఔషధ గుణాలు నీటితో శుద్ధి చేస్తాయి మరియు నీటిలో బాక్టీరియా మరియు వైరస్ ని తొలగిస్తాయి. ”

60 మందికి పైగా తెలంగాణ కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి, మురళీధర రావు ,హెబ్బల్ ఎమ్మెల్యే కుమారస్వామి,MLA పైలా శేకర్ రెడ్డి, మాలిని ఐఎఎస్, మనోజ్ కుమార్ ఐఎఫ్ఎస్, తెలంగాణ, కర్ణాటక నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు”

ఈ ఈవెంట్ గురించి మరింత సమాచారం కోసం, KRTA ప్రెసిడెంట్ సందీప్ మక్తాల 08123123434 లేదా 8123457575 వద్ద సంప్రదించండి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here