కౌలు రైతులకు మనోస్తైర్యం ఇస్తున్నకౌలు రైతు ఛాలెంజ్

0
3945

మన పుట్టిన రోజు వచ్చిందంటే కేక్ కట్టింగులు,పార్టీలు,రెస్టరారెంట్ లు,ఫ్రెండ్స్ అంటూ మనం అనవసరపు ఖర్చులు చేస్తుంటాం.కొందరు రైతు మిత్రులు మాత్రం తమ పుట్టినరోజున ఖర్చులు పెట్టకుండా ఆ ఖర్చులను కౌలు రైతులకు,రైతు కూలీలకు బాసట గా నిలిచారు.సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ప్రతినిధులు ఈ కొత్త రకపు పంథాను పాటిస్తూ రైతుల సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్నారు.ఐటి ఉద్యోగి,ఈ ngo ప్రెసిడెంట్ అయిన రవిందర్ ర్యాడ ఈ పద్ధతికి శ్రీకారం చుట్టి ,తన మిత్ర బృందానికి కూడా ఇదే రకపు ఛాలెంజ్ విసిరి రైతులను కాపాడేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు.వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ ప్రాంతంలో కమ్మర్పల్లి మండల్ లో దేవేందర్ అనే రైతుకు 2000 రూపాయలు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ తెలంగాణ కన్వీనర్ దుంపల నరేష్ చేత అందచేయటం జరిగింది.ఎరగట్ల మండలంలో తొర్తి గ్రామంలో మరో కౌలు రైతుకి 2000 రూపాయలు నిజామాబాద్ జిల్లా కన్వీనర్ చేత అందచేయటం జరిగింది.ఈ కార్యక్రమాన్ని తనతోనే ముగియకుండా మిగతా వాళ్ళు కూడా తమ పుట్టిన రోజున కాని లేక మరొక శుభసందర్భంలో కాని అనవసరపు ఖర్చు పెట్టకుండా మీకు తెలిసిన ఒక కౌలు రైతుకో లేక రైతు కూలికి సహాయం చేయాలని రవిందర్ కోరిక.దీని కోసం ఒక ఛాలెంజ్ విసిరాడు. ఈ ఛాలెంజ్ ని అంగికరీంచి వీళ్ళు కూడా కౌలు రైతులకు సహాయం చెయలని ఆయన కోరిక.ఈ ఛాలెంజ్ ని .సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సహచరులకు ఛాలెంజ్ విసరడం జరిగింది.వచ్చే ఏడాది లోపు కౌలు రైతుల సమస్యలు తీరాలని వాళ్ల టీం కోరిక. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్బంగా తన ఐటి మిత్రులతో కలిసి తన స్వచ్చంద సంస్థ తో కలిసి దుందిగల్ లో ఉన్న ముగ్గురు కౌలు రైతులకు 10000 రూపాయలు ఇవ్వడం జరిగింది.కౌలు రైతుల బాధను తెలుసుకొని వాళ్లకు సహాయం చేయటంతో .సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ని అందరు ప్రశంసిస్తున్నారు.గతంలో ipl మ్యాచులో రైతులకు సపోర్టుగా ఇదే టీం పచ్చ రూమళ్లతో ప్రదర్శనలు ఇవ్వడం అందరికి తెలిసిన సంగతే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here