మిషన్ కొదాడ చెరువు కబ్జా

0
889
jalagam-sudheerఒకప్పుడు కొదాడ పట్టణం మొత్తానికి  దాహర్తిని తీర్చిన కొదాడ (నల్లగొండ) చెరువు గత ముప్పై సంవత్సరాలుగా   అవినీతి అధికారుల నిర్లక్ష్యం వల్ల, రాజకీయ నాయకుల భూ కబ్జాల పర్వం తో తన ఉనికిని కొల్పొయే పరిస్తితి లోకి వచ్చింది. రాష్ట్రాన్ని పాలించిన, పాలిస్తున్న పార్టిల సభ్యులు ఈ చెరువు భూమిని కబ్జా చేయటం లో ముందున్నారు అని అనేక పత్రీకల్లో కథనాలు వచ్చిన అధికారులు ఆ వైపు పెద్దగా పట్టించుకున్న ధాఖలాలు లెవు. గతం లో నిప్పు లాంటి పార్టి, నీతికి మారు పేరు అని ప్రకటించుకున్న ఒక పార్టి  ఏకంగా పార్టిల కార్యాలయాలే కట్టి చెరువును కాపాడుదాం, నీటి ని పొదుపు చేద్దాం అని ఆ నాయకుల సిగ్గులేని ప్రకటనలు చూసి అనేకమంది   పట్టణ ప్రముఖులు    తమ నిరసన వ్యక్తం చెసిన్రు.
తమకున్న వర్గ బలం తో, అప్పటి జిల్లా మంత్రి ప్రోత్సాహం తో చెరువు కు సంబందించిన వందల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినా కూడ  పట్టణం లోని నిరుపేదలు, మద్య తరగతి ప్రజలు  నీల్ల కోసం ఇబ్బంది పడిందే తప్ప ఆప్పటి మంత్రి గారి అనుచరుల భూ దందా ని  నిలువరింపలేకపొయింది.
నెల  రోజుల క్రితం కొమరబండ చెరువు ను ఆక్రమించటం లో ప్రస్తుత పాలక పార్టి ప్రముఖులు ఉన్నారని, నాలుగు  రోజుల క్రితం కొదాడ చెరువు కు సంబందించిన  2.5 ఎకరాల భూ కబ్జా లో ఇంకొందరి హస్తం ఉందని పట్టణానికి చెందిన పలువురు ఆరొపిస్తున్నారు.
ఈ విషయాలన్నిటిని 06/21/2016  న ఇరిగెషన్ శాఖ మంత్రి ఓ.ఎస్.డి శ్రిధర్ దేశ్ పాండే తో జలగం సుధీర్ అమెరికా నుండి  ఫోన్ లో మాట్లాడి సమస్య ను  వారి ద్రుష్టికి తీసుకెల్లి వారిని వెంటనే పూర్తి విచారణ జరిపించాలని కోరటం జరిగింది.కలెక్టర్, ఆర్.డి.ఓ తో మాట్లడి విచారణ జరిపిస్తామని శ్రిధర్ దేశ్ పాండే గారు హామి ఇచ్చారు.
సుమారు 120 ఎకరాలకు పైగా  కోదాడ చెరువు భూమిని, పక్కనే ఉన్న కొమరబండ చెరువుని    కబ్జా పెట్టిన బడా బాబులపై వెంటనే చర్యలు తీసుకొని భావితరాలకు ఉపయొగపడే కొదాడ చెరువును కాపాడే భాద్యత ప్రభుత్వం తో పాటు ఇటువంటి సమస్యలను ప్రభుత్వం ద్రుష్టి కి చేరవేయటం లో మనందరి పై కూడ కొంత  భాద్యత ఉంటుంది.
తన సొంత పట్టణ చెరువు  సమస్య పై అనేకసార్లు పత్రికల్లో నిర్భయంగా నిజాయితి తో వార్తలు రాసిన కోదాడ పాత్రికేయులకు ప్రత్యేక క్రుతజ్ఞతలు అని – జలగం సుధీర్ అనే తెలంగాణ ఎన్.ఆర్.ఐ సియాటెల్ నగరం నుండి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here