ఖైదీ నెంబర్ 150 రివ్యూ

0
2400

 

30 ఏళ్ళు తెలుగు సినిమాను పరిపాలించి , 9 ఏళ్ల క్రీతం శంకర్ దాదా జిందాబాద్ సినిమా తీసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయినప్పటినుంచి తెలుగు ఇండస్ట్రీ లో నెంబర్ 1 స్థానం అలాగే ఉండిపోయింది. విచిత్రం ఏంటంటే అయన రాజకీయాల్లోకి వెళ్లిన మొదటి రోజునుంచి అయన మళ్ళి సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడని ప్రేక్షకులు ఎదురు చూశారంటే ఆయనకున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఐతే అయన సినిమాల్లోకి మళ్ళి రావటంపై . మళ్ళి అలాంటి డాన్సులు చేస్తారా మళ్ళి అలాంటి ఫైట్స్ చేస్తారా? పాత సినిమాల్లో ఉండే హాస్యం పండిస్తారా అంటూ ఎన్నో సంశయాలు ,ఎన్నో సందేహాలు వెలిబుచ్చారు విమర్శకులు.ఇలాంటి సమయంలో  తమిళ్లో మురగదాస్ తీసిన రమణ  ని తెలుగు లో వినాయక్ దర్శకత్వంలో ఠాగూర్ లాంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ ఇచ్చిన కంబినేషన్లోనే ఖైదీ నెంబర్ 150 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు చిరంజీవి. ఇపుడు ఆ సినిమా ఎలా ఉందొ చూద్దాం?

 

 

కథ

ఖైదీ నెంబర్ 150 అయిన శీను(చిరంజీవి) అలీ తో కలిసి దొంగతనలు చేస్తుంటాడు. రైతుల కోసం పోరాడే సైంటిస్ట్ ((చిరంజీవి). జైలు నుంచి పారిపోయిన శీను ని చూసి శంకర్ అనుకుంటారు విలన్ గ్యాంగ్ .ఐతే శంకర్ కి ,శీను కి సంబంధం ఏంటి ?కాజల్ అసలు ఎవరు ప్రేమిస్తుంది?విలన్ తరుణ్ అరోరా కి శంకర్ కి గల సంఘర్షణ ఏంటనేది సినిమాలోనే చూడాలి.

నిజానికి ఇది రొటీన్ స్టోరీ అయిన కూడా తమిళ్ కత్తిలో మురుగదాస్ మంచి సోషల్ ట్రీట్మెంట్ తో మంచి కథ గా మలిచాడు. ఐతే ఆ సినిమా కొంచెం సీరియస్ మూడ్లో ఉంటుంది.వినోదం ఎక్కువ ఉండదు ,డాన్సులు పెద్దగా ఉండవు. కేవలం స్టోరీ డ్రివెన్ సినిమాగా ఉంటుంది. కానీ ఈ సినిమా ని తెలుగులో చిరుతో తీయాలననుకున్నప్పుడు పైన అంశాలు కచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే చిరంజీవి కం బ్యాక్ సినిమా కావటం,చిరంజీవి సినిమా అంటే కచ్చితంగా అవి ఉండాల్సిందే. అదే సమయంలో కోర్ స్టోరీ భగ్నం కావొద్దు . ఇవ్వన్నిటిని దృష్టిలో వి వి వినాయక్ పరుచూరి బ్రదర్స్ ని కూచోబెట్టుకొని ,సత్యానంద్ సహకారంతో బుర్ర సాయి మాధవ్ గారి సోషల్ టచ్ డైలాగ్స్ తో ఖైదీకి ఒక టైట్ స్క్రిప్ట్ తయారుచేయడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

 

విశ్లేషణ

కష్టపడి స్వయంకృషి చేసి పైకి వచ్చినవాళ్లలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారని చాల మంది మంచి ఉదాహరణలుగా చెప్తారు. 60 ప్లస్ లో కూడా ఇలా కష్టపడి సన్నపడి డాన్సులు చేసి ఫైట్స్ ఇరగదీయటం చూస్తుంటే ఈ తరం వాళ్ళు కూడా చిరుని ఒక స్ఫూర్తుదాయకమైన వ్యక్తి చూస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఎంత చెప్పిన కూడా ఇది చిరుకు 150 వ సినిమా కావటం అది కూడా కం బ్యాక్ సినిమా కావటం వలన జనాలు సినిమా కు చిరు కోసమే వెళ్తారనేది జగమెరిగిన సత్యం. దానికి తగ్గట్టుగానే 35 ఏళ్ల కుర్రాడిలా సన్నబడటం ఆపద్బాంధవుడు ,గ్యాంగ్ లీడర్ సినిమాల్లో లాగా లైట్ గడ్డంతో చిరు లుక్ అందరిని మెస్మైరైజ్ చేస్తుందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అయన నవ్వు పాత చిరు నవ్వు గుర్తుకొస్తుంది. అయన మేక్ ఓవర్ తోనే సినిమా సగం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు .

ఇక డాన్సులు గురుంచి చెప్పాలంటే ఈ తరానికి చిరు గ్రెసుని చూయించి డాన్సులు చేస్తే ఆయనే చేయాలని నిరూపించాడు.ప్రధానంగా రత్తాలు రత్తాలు ,అమ్మడు కుమ్ముడు సాంగ్స్ లో మాస్ స్టెప్స్,సుందరి ,మీ అండ్ మీ సాంగ్ లో గ్రెసు సూపర్.

25 ఏళ్ల కుర్రాళ్లు కూడా కస్టపడి చేసే వీణ స్టెప్ 60 ప్లస్ లో కూడా ఇరగదీసాడంటే హాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఒక పాటలో చరణ్ వచ్చి డాన్స్ చేస్తాడు. ఇద్దరు కుమ్మేసిన కూడా అందరి చూపు చిరు వైపే ఉంటుంది.

ఫైట్స్ లో కొత్తదనం చూయించారు. చిరు స్టైల్ సూపర్బ్. అలీ ఓ చేసిన కామెడీ ఐతే దొంగ మొగుడు చిరంజీవి గుర్తొస్తాడు. ప్రధానంగా మందుకొట్టే సీన్లో ఆయనకున్న మేనరిజాన్ని మరోసారి బయట పెట్టాడు. కాజల్ తో కెమిస్ట్రీ బాగుంది. సైంటిస్ట్ పాత్రలో సీరియస్ పాత్రలో ఠాగూర్ లోని చిరు గుర్తుకువస్తాడు.

ఈ సినిమాలో చిరు తర్వాత విలన్ తరుణ్ అరోరా గురుంచి చెప్పుకోవాలి. ఒక స్టైలిష్ విలన్ గా బాగా చేశాడు. చిరు -తరుణ్ సన్నివేశాలు బాగుంటాయి . ఇక కాజల్ పాత్రకు తగ్గట్టుగానే ఉంది. అలీ కామెడీ టైమింగ్ సినిమాకు మరో హైలైట్ . బ్రహ్మానందం రొటీన్ అనిపిస్తాడు . లక్ష్మి రాయ్ మెరుపులు అందరికి నచ్చుతాయి.

ఇక వినాయక్ టేకింగ్ ,డైరెక్టన్ సూపర్బ్ అని చెప్పొచ్చు. ఒక అభిమాని తన అభిమాన కథానాయకుని సినిమా తీస్తే ఠాగూర్ ,మేజర్ చంద్ర కాంత్ ,గబ్బర్ సింగ్ సినిమాల రూపంలో బయటకు వస్తాయని ఇది వరకు ప్రూవ్ అయింది. ఇపుడు ఖైదీ 150 ద్వారా ఆ సెంటిమెంట్ ని వినాయక్ కంటిన్యూ చేశాడు.నీరు నీరు పాటను నేపధ్యంగా వాడుకోవడంలో కూడా వినాయక్ టాలెంట్ బయట పడింది. చిరు ఏరి కోరి ఈ సబ్జెక్టుని వినాయకి ఎందుకు ఇచ్చాడో ఈ సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది.

ఇక మరొక అభిమాని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురుంచి చెప్పాలంటే అయన ఫేవరేట్ హీరో ఎలాంటి స్టెప్స్ వేయాలి అంచనా వేసి మరీ మ్యూజిక్ అందించాడు. ,అయన ఇచ్చిన ఆల్బం మొత్తం సూపర్బ్ ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా బాగుంది. నీరు నీరు సాంగ్ హార్ట్ టచింగ్ గా ఉంది. మాస్ సాంగ్స్ ఐతే చెప్పాల్సిన అవసరం లేదు.

రామ్ చరణ్ ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్ . కొణిదెల సుస్మిత కాస్ట్యూమ్ డిజైన్లు చిరు వయసుని తగ్గించాయి.

రత్నవేలు ఫోటో గ్రఫీ సూపర్బ్ .

పరుచూరి బ్రదర్స్ ,బుర్ర సాయి మాధవ్ మాటలు బాగున్నాయి. చిరు స్టైల్ కి సరిపోయాయి. ప్రధానంగా స్వీట్ వార్నింగ్ ,ఇంట్లో హీరోహీజం డైలాగులు ఐతే విజిల్స్ పడతాయి.

 

ప్లస్ points

  • చిరంజీవి
  • డాన్సులు
  • ఫైట్స్
  • రైతులతో ఎమోషనల్ సన్నివేశాలు
  • చరణ్ ,అల్లు అర్జున్ గెస్ట్ అప్పీరెన్స్

 

మైనస్ points

  • బ్రహ్మి కామెడీ రొటీన్ స్టోరీ
  • ఎడిటింగ్

rating: 4/5

verdict: బాస్ is బ్యాక్

 

 

Reviewed by:Ravinder

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here