కేశినేని బస్సులకు ఆరెంజ్ స్ట్రోక్

0
729

తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్స్ రంగంలో ఎదురులేని ట్రావెల్స్ అయిన కేశినేని ట్రావెల్స్ బస్సులకు దెబ్బ పడిందా ? చూస్తుంటే అవునని తెలుస్తుంది. దశాబ్దాలుగా ట్రావెల్స్ రంగంలో ఆధిపత్యం వహిస్తూ అధికారంలో ఎవరున్నా కూడా పరాభవం ఎదురుకాని కేశినేని ట్రావెల్స్ కి స్వయానా తమ కంపనీ అధినేత కేశినేని నాని విజయవాడ ఎంపీగా ఉండి,అయన ప్రాతినిధ్యం వహిస్తున్న తెదేపా పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా తన స్వంత గడ్డ పైన పొరుగు రాష్ట్రానికి చెందిన ఆరంజ్ ట్రావెల్స్ చేతిలో పరాభవం ఎలా జరిగిందో ఒక సారీ చూద్దాం.

అసలు విషయానికొస్తే ఇటీవల విజయవాడ ఆటోనగర్ లో ఆరంజ్ ట్రావెల్స్ బస్సు ఒక కూలీని ఢీకొట్టగా అయన మరణించాడు. ఐతే ఆ ఆక్సిడెంట్ కేవలం డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిందని విజయవాడ ఆర్టీఓ కమిషనర్ బాలసుబ్రమణ్యం నివేదిక ఇచ్చారు. ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం విధించిన లగేజ్ విధానంతో ఆదాయం కోల్పోతూ కేశినేని ట్రావెల్స్ వస్తున్నారు. తెలంగాణ కి చెందిన ఆరంజ్ ట్రావెల్స్ ని ఆంధ్రలో తిరగకుండా చేస్తే ట్రావెల్స్ కి ఆదాయం పెరుగుతుందని అనుకుంటున్న నానికి ఈ ఆక్సిడెంట్ ని అవకాశంగా తీసుకొని ఎలాగైనా ఆరంజ్ ట్రావెల్స్ ని బహిష్కరించాలని కుట్రకు పన్నాగం పన్నినట్లు తెలుస్తుంది . ఈ ఆక్సిడెంట్ ఆరంజ్ బస్సు యొక్క ఫిట్నెస్ బాగాలేక జరిగిందని నివేదిక ఇవ్వాలని నాని, బాలసుబ్రమణ్యం పైన తనకున్న అధికారంతో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దానికి అనుగుణంగా విజయవాడ స్థానిక నాయకులతో కలిసి ఆర్టీఓ ఆఫీస్ ముందు ఆందోళనలు చేశారు.

కాని స్వతహాగా నిజాయితీపరుడు,ధైర్యవంతుడు అయిన కమిషనర్ బాలసుబ్రమణ్యం మాత్రం ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లోనవకుండా ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిందని చెప్పటంతో నానికి ఎటు పాలుపోవటం లేదని తెలుస్తుంది.

ఆరంజ్ ట్రావెల్స్ అధినేత కబుర్లు టీంతో మాట్లాడుతూ

“ఒక పక్క అమరావతిలో ప్రపంచ దేశాలనుంచి పెట్టుబడులు పెట్టమని చంద్రబాబు గారు విశాల హృదయంతో ఆహ్వానాలు అందజేస్తుంటే మరో వైపు తన పార్టీ నాయకులు మాత్రం తోటి తెలుగు రాష్ట్రము నుంచే వచ్చే బస్సులను ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు , అది కూడా ఫిట్నెస్ లో నెంబర్ 1 ర్యాంక్ పొందిన ఆరంజ్ బస్సులను ఆపాలనే కుట్రలు చేయటం నిజంగా దురదృష్టకరం.కమిషనర్ బాలసుబ్రమణ్యం గారు లేకపోతె మమ్మల్ని కేశినేని నాని విజయవాడలో చంపేసేవారు ,అలాంటి నాయకులు వాణిజ్య నగరమైన విజయవాడకు ఎంపీగా ఉండటం అనేది అక్కడి ప్రజలు చేసుకున్న దురదృష్టం ,వీలైనంత వరకు అలాంటి వారిని విజయవాడ నుంచి పారదోలాలి, ఈ పరిణామం అమరావతి బ్రాండుకి మంచిది కాదు ”

అని తెలిపారు.

ఇప్పటికే తెదేపా కి చెందిన జేసీ దివాకర్ ట్రావెల్స్ పైన చాల వివాదాలు వచ్చాయి. ఇపుడు తెదేపా నాయకుడికి కి చెందిన కేశినేని ట్రావెల్స్ వివాదంలోకి రావటంతో ఆంధ్ర సీఎం చంద్ర బాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అది కూడా తెలంగాణ కి చెందిన ఆరంజ్ బస్సులను ఆపటం అనేది రాజకీయ పరంగా చిక్కులు తప్పవని భావించినట్లు సమాచారం. ఇప్పటికే కేశినేని నాని పైన చాల విషయాల్లో అసంపూర్తితో తో ఉన్న బాబు చురకలు అంటించినట్లు సమాచారం. చివరికి చంద్రబాబు ఒత్తిడితో ఆర్టీఓ అధికారులకు కేశినేని నాని క్షమాపణ చెప్పాడు.

దీనితో కేశినేనికి ఏమి చేయాలో తెలియక ఆరంజ్ ట్రావెల్స్ ys జగన్ బినామీ డబ్బులతో నడుస్తుందని కొత్త ఆరోపణ కి శ్రీకారం చుట్టాడు. ఏది ఏమైనా ఇప్పటి వరకు తాను ఏమి చేసిన ,ఏది ముట్టిన బంగారు ఫలితాలు పొందిన కేశినేని నాని కి ఆరంజ్ ట్రావెల్స్ వివాదంతో గడ్డుకాలం వచ్చిందని విజయవాడ స్థానికులు అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here