రేవంత్ రెడ్డి కేసీఆర్ ల మధ్య పచ్చ గడ్డి వేసిన భగ్గు మంటుంది అనేది అక్షరసత్యం.ఒకానొక సమయంలో తెలంగాణ లో రేవంతా కేసీఆరా అనే విదంగా యుద్ధం సాగింది.కాని 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ స్థానాన్ని బండి సంజయ్ ,ధర్మపురి అర్విందులు కైవసం చేసుకున్నారు. దానికి తగ్గట్టు రాష్ట్రంలో భాజపా ఒక్కో మెట్టు ఎక్కటం మొదలుపెట్టింది.ప్రత్యేకంగా నిజామాబాద్ కార్పొరేషన్ ,దుబ్బాక ఉప ఎన్నిక ,గ్రేటర్ ఎన్నికల్లో భాజపాకు విపరీతమైన స్పందన వచ్చింది.దానికి తగ్గట్టు గా రేవంత్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసకు వెళ్లడం,ఉత్తమ్ లాంటి వ్యక్తి మీద కాంగ్రెస్ శ్రేణులు నమ్మకం కోల్పోవడం లాంటివి కాంగ్రెస్ పార్టీ ని మూడో స్థానంలోకి నెట్టింది.కాని ఇటీవల పీసీసీ కి ఉత్తమ్ కుమార్ రాజీనామా చేయడం అనేది 50 ఓవర్ల వన్ డే మ్యాచ్ లో 45 ఓవర్లు ఉత్తమ్ చెత్త స్లో బాటింగ్ చేసి ఔట్ అయి వేరే వాళ్లకు అవకాశం ఇచ్చినట్లు అయింది.ఈ సమయంలో రేవంత్ కి పీసీసీ ఇస్తే కాంగ్రెస్ కన్నా తెరాస కు లాభాలు ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది.
1.బీజేపీ వెళుతున్న రెడ్ల ఓట్లు,ఇతర తెరాస వ్యతిరేక ఓట్లు,యూత్ ఓట్లు చీలిపోతాయి.
2.సోషల్ మీడియా ని గమనిస్తే బీసీలల్లో కూడా రేవంత్ ప్రామిసింగ్ లీడర్ గా కనిపిస్తున్నాడు.ప్రధానంగా ఆయన సెగ్మెంట్ లో ముదిరాజ్ కమ్యూనిటీ ఎక్కువ ఉండటం వల్ల రాష్ట్రంలోని ముదిరాజులు ఎక్కువగా రేవంత్ వైపు వెళ్లే అవకాశం ఉంది.అలా చూస్తే భాజపాకు వెళ్లాల్సిన బీసీ ఓట్లను కూడా రేవంత్ చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీన్ని బట్టి చూస్తే ఇప్పటివరకు రేవంత్ అంటే మింగుడుపడని తెరాస ఇపుడు పీసీసీ ఆయనకే రావాలని కోరుకుంటుందేమో.